గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నేత దానం నాగేంద్ర కాంగ్రెస్ ని వీడటం తెరాసలో జాయిన్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. గ్రేటర్ లో తెరాసను బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా ఆయనను పార్టీలోకి తెచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఈ చేరిక తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లికి కంటగింపుగా మారింది.
చంద్రబాబుని తిట్టి కేసీఆర్ ను పొగిడినా తనను తెరాస అధినేత పట్టించుకోకపోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మోత్కుపల్లికి అంగ బలం, అర్ధబలం లేకపోవడంతో ఆయనను పార్టీలోకి తీసుకున్న పెద్దగా ఉపయోగం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పైగా మోత్కుపల్లికి ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తుందో ఎవరి మీద విరుచుకుపడతారో తెలీదు.
దీనితో ఆయనను పార్టీలోకి తీసుకోవడం అనవసరమైన తలనొప్పి అని భావిస్తున్నారట. దీనితో మిన్నకుండి పోయారు. అయితే మోత్కుపల్లి మాత్రం ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. మొత్తానికి ఆయన పని ఉన్నది, వస్తుంది అనుకున్నది కూడా లేకుండా పోయినట్టు అయ్యింది.



