రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం.. ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబందు బీమా పథకం కింద.. 18 నుంచి 60 ఏళ్ల లోపు రైతులు దురదృష్టవశాత్తూ ఎలా మరణించినా బీమా వర్తిస్తుందని తెలిపారు. రైతు కుటుంబీకులకు 10 రోజుల్లోనే బీమా సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆగస్టు 15లోపు రైతులతో బీమా పత్రాల్లో వివరాలు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంతో 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నట్లు జాతీయ మీడియా సర్వే లో తేలిందని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. రైతుబంధు పథకంతో రాష్ట్రంలో కొన్ని పార్టీలు దివాళా తీశాయన్నారు.
తెలంగాణలో రైతుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని.. నేను తెలంగాణ రైతుని అని సగర్వంగా చెప్పుకునే స్థితికి అన్నదాతలు చేరాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 89% శాతం రైతులు హ్యాపీ గా ఉన్నారంటే రాష్ట్రంలో కౌలు రైతులు 11% మాత్రమే ఉన్నారా? రైతుబంధు సహాయం కేవలం భూయజమానులకు ఇచ్చిన సంగతి తెలిసిందే.



