రెండున్నర దశబ్ధాల పాటు తెలంగాణ రాజకీయాలను కంటి చూపుతో శాశించిన కేసీఆర్ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఫామ్‌హౌస్‌లో యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆయన పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాలకు దూరంగా ఉండిపోవడంతో కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు ఇద్దరూ కలిసి బిఆర్ఎస్ పార్టీని బాగానే నడిపిస్తున్నారు. అయితే మళ్ళీ ఏమయిందో తెలీదు కానీ కేటీఆర్ కొన్ని రోజులు సెలవు తీసుకుంటున్నానని హటాత్తుగా ట్వీట్ చేశారు.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
“కాస్త రిఫ్రెష్ అయ్యి వచ్చేందుకు పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాల నుంచి కొన్ని రోజులు సెలవు తీసుకుంటున్నానని, నా రాజకీయ ప్రత్యర్ధులు నన్ను ‘మిస్’ కారని ఆశిస్తున్నాను,” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ మాతో కొంతమంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్చులో ఉన్నారు,” అని చెప్పారు. అంటే త్వరలో మళ్ళీ ‘ఆపరేషన్ ఆకర్ష’ మొదలుపెడతామని సూచన ప్రాయంగా చెప్పారనుకోవచ్చు. కనుక ఇటువంటి సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలసిన కేటీఆర్ సెలవులో వెళుతుండటం ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తోంది.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
త్వరలోనే ఆయనని అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని, గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. పలువురు మంత్రులు కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదని చెపుతూనే ఉన్నారు.
తాను కూడా అరెస్టుకి సిద్దంగానే ఉన్నానని, అరెస్ట్ చేస్తే రెండు నెలలు జైల్లో యోగా వగైరా చేసుకొని ‘ఫిట్’గా తయారయ్యి బయటకు వస్తానని కేటీఆర్ అన్నారు.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
కానీ ఇప్పుడు కేటీఆర్ హటాత్తుగా సెలవు తీసుకుంటుండతో ఆయన అరెస్టుకి రంగం సిద్దమైందని పసిగట్టరా?అందుకే విదేశాలకు బయలుదేరబోతున్నారా?అనే అనుమానం కలుగుతోంది.
రాజకీయ నాయకులు విదేశాలలో సేద తీరి రావడం సర్వసాధారణమైన విషయమే. కేటీఆర్ ఇలా ట్వీట్ చేయకుండా విదేశాలకు బయలుదేరి ఉండి ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారే కాదు. కానీ సెలవు తీసుకుంటున్నాని చెప్పి బయలుదేరుతుండటమే ఇటువంటి అనుమానాలు, అపోహలకు తావిస్తోంది.