
అవి కేసీఆర్ కంటిసైగతో దేశరాజకీయాలను శాశించగలనని భ్రమపడుతున్న రోజులు. ఆ సమయంలోనే మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలలో రాజకీయ నిరుద్యోగులను వెతికి పట్టుకొని వారిచేత ఆయా రాష్ట్రాలలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయించుకొని, ఏపీతో సహా ఆయా రాష్ట్రాలలో గులాబీ జెండాలను రెపరెపలాడించారు కూడా.
ఆ ఊపులోనే మహారాష్ట్రని జయించేందుకు కేసీఆర్ 600 కార్లు వేసుకొని దండయాత్ర చేసి వచ్చారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పధకాలు చూసి, సరిహద్దులో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ప్రజలు తమ జిల్లాని తెలంగాణలో విలీనం చేసేయాలని కోరుకున్నారని బిఆర్ఎస్ పార్టీ డప్పు కొట్టుకునేది.
Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!
ప్రపంచమంతా జయించిన అలగ్జాండర్ భారత్‌కు వచ్చి తిరిగిపోయిన్నట్లుగా, ప్రత్యేక విమానాలు వేసుకొని దేశమంతా గిరగిర తిరిగిన కేసీఆర్ పక్కనే ఉన్న ఏపీలో మాత్రం అడుగుపెట్టే సాహసం చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాన్ని నిలువునా చీల్చినందున ప్రజలు తనపై ఆగ్రహంగా ఉన్నారనో లేదా జగన్‌తో అవగాహన ఉన్నందునో ఏపీలో అడుగుపెట్టలేదు.
కానీ అప్పుడప్పుడు తన మంత్రిగారిని అదే.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని భీమవరం పంపించి ఏపీలో రాజకీయ వాతావరణ వివరాలు తెలుసుకుంటుండేవారు. ఆయన మాత్రం చేపల పులుసు, నాటు కోడి పులావు సరుషతుగా తినేసి వెళ్ళి ‘మనమే బెస్ట్ ఏపీ వేస్ట్’ అని చెపుతుండేవారు.
Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?
సరిగ్గా అటువంటి సమయంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసింది. పెళ్ళి చేసుకున్నవారందరికీ పంతులుగారు తప్పకుండా అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. కానీ అది అందరికీ కనబడదు. అలాగే ఏపీలో అధికార, ప్రతిపక్షాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా కనబడలేదు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.
కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వారికి కనపడని పాయింట్ కేసీఆర్‌కి కనపడింది. ఏపీలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదని భావించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనేస్తానంటూ అక్కడ గులాబీ జెండాలు పెట్టించి, సింగరేణి అధికారులను పంపించి చాలా హడావుడి చేశారు.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
కానీ దాంతో నష్టమే తప్ప ఆశించిన స్థాయిలో రాజకీయ మైలేజ్ రాదని తెలుసుకోగానే మిడిల్ డ్రాప్ అయిపోయారు.
ఆరోజు ఆయన ఏ కారణం చేత వెనకడుగు వేసినా, దాని వలన ఏపీకి, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మేలే జరిగింది.
సిఎం చంద్రబాబు నాయుడు, ఇద్దరు కేంద్రమంత్రులు, అధికారులు అందరి కృషి ఫలించింది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆలోచన పక్కనపెట్టి దానిని ఒడ్డున పడేసేందుకు రూ. 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు… అని కేసీఆర్ సొంత పత్రికలోనే వార్త వచ్చింది.