మరోసారి ‘మహానటి’ దర్శనం?

Keerthy Suresh as mahanati savithri in ntr biopicసావిత్రి బయోపిక్ గా ఇటీవల వచ్చిన ‘మహానటి’ చిత్రం కథానాయిక కీర్తి సురేశ్ కి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. అలనాటి సావిత్రిని అనుకరిస్తూ ఆమె చూపిన అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటిగా ఆమెను ఆ చిత్రం ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ మరోసారి సావిత్రిగా కనిపించనుందంటూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ కధనం ప్రచురించింది.

ADVERTISEMENT

ఎన్టీఆర్ జీవితకథగా తెరకెక్కుతున్న బయోపిక్ లో కీర్తి సురేశ్ మళ్లీ సావిత్రి పాత్రను పోషించనుందనేది ఈ కధనం సారాంశం. ఎన్టీఆర్ తో కలసి సావిత్రి పలు హిట్ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రస్తావన కూడా వస్తుందట. ఆయా సందర్భాలలో కనిపించే సావిత్రి పాత్ర కోసం కీర్తిని అడిగినట్టు, ఆమె వెంటనే అంగీకరించినట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories