పార్లమెంట్ మొదటి రోజే టీడీపీ అవిశ్వాస అస్త్రం

Kesineni Nani - no confidence motionపార్లమెంట్ సెషన్ మొదటి రోజే అగ్గి రాజేసేలా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టడానికి సిద్ధం అవుతుంది. మొదటి రోజే అవిశ్వాసతీర్మాణం చెప్పట్టాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని లోక్ సభ సెక్రటరీకి తమకు మద్దత్తు ఇస్తున్న ఎంపీల సంతకాలతో లేఖను ఇచ్చారు.

ADVERTISEMENT

అయితే గత సమావేశాల్లోనూ తెదేపా, వైకాపా సభ్యులు పోటాపోటీగా పలుమార్లు ఇటువంటి ప్రయత్నాలు చెయ్యగా అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు కోసం చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సభ ఆర్డర్‌లో లేదంటూ సభాపతి సుమిత్రా మహాజన్‌ చెప్పడం, సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేయడంతో వాయిదాల పరంపరతో సభా కార్యకలాపాలు స్తంభించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఏం జరగబోతుందో చూడాలి. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేసిన విషయం తెలిసిందే. మరి మోడీ ప్రభుత్వం తన మొదటి విశ్వాస పరీక్షను ఎదురుకుంటుందా లేదా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories