కాంగ్రెస్ లో చేరగానే కిరణ్ కుమార్ రెడ్డి చిలక పలుకులు!

Kiran Kumar Reddy return To Congress partyమాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరారు. “మా కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతోనే గుర్తింపు వచ్చింది. నా తండ్రి నాలుగుసార్లు, నేను నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచామంటే అది కాంగ్రెస్‌ పార్టీ వల్లే.‌ గాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం వల్లనే నేను చీఫ్‌ విప్‌, స్పీకర్‌, ముఖ్యమంత్రి వంటి పదవులు అనుభవించగలిగాను,” అని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

“కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తా. కాంగ్రెస్‌ వీడిన 30-40 మంది నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్‌ పార్టీ వల్లే సాధ్యం. పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం అపహాస్యం చేసింది. విభజన చట్టం అమల్లో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ తో విడదీయలేని బంధం ఉందని చెప్పుకుంటున్న కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు పార్టీని వీడి సొంత పార్టీ ఎందుకు పెట్టారో? పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సర్వనాశనం కావడానికి ఆయన కూడా కారణమే కదా? విభజన హామీలు అమలు కాంగ్రెస్ వల్లే అని చెబుతున్న ఆయన వాటిని నమ్మకే కదా పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయింది?

ADVERTISEMENT
Latest Stories