
2014 లో కెప్టెన్సీ పగ్గాలను అప్పుడే అందుకున్న విరాట్ కోహ్లీ నేతృత్వం లో ఆస్ట్రేలియా గడ్డ పై డెబ్యూ చేసాడు కె.ఎల్.రాహుల్. రెండేళ్ల తరువాత 2016 లో తొలి వన్-డే మ్యాచ్ ఆడిన రాహుల్, మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
ఆలోపే టి-20 సెంచరీ కూడా అందుకుని, ప్రపంచంలోనే మూడు ఫార్మాట్లలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు రాహుల్. ఐపీఎల్ 2016 -17 లో ఆర్.సి.బీ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, 2018 నుండి పంజాబ్ జట్టుకు సారధిగా మారాడు. ఐపీఎల్ లో తానే సరికొత్త రికార్డులను నెలకొల్పాడు.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
అదే సమయంలో, జాతీయ జట్టులో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. సొంత గ్రౌండ్లలో కనపరిచిన ఆటతీరునే బయట గ్రౌండ్లలో కూడా కనబరిచి ఔరా అనిపించాడు. ఇక 2021 -22 మధ్యలో కరోనా బ్రేక్ రాహుల్ కెరీర్ లో ఎంతో మార్పు చూపింది. సమయానికి తాను ఫామ్ కోల్పోవటం, రిషబ్ పంత్ సత్తా చాటటం, రాహుల్ స్థానాన్ని సంకటం లో పడేసింది.
2022 ఐపీఎల్ లో లక్నో జట్టుకు సారధిగా మారాడు రాహుల్. ఎలాగోలా 2023 లో సొంత పిచ్ల పై ఆడనున్న వరల్డ్ కప్ టీం లో ఎంపికవ్వగా, ఆ వరల్డ్ కప్ తన కెరీర్ లోనే బెస్ట్ టోర్నీ గా నిలిచిపోయింది. ఎంత ఆడితేనేం..? ఫైనల్స్ లో ఆసీస్ పై చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయటం, అదే సమయానికి ఐపీఎల్ లో సైతం చాలా స్లో బ్యాటింగ్ చేయటం వలన మరలా టీం కు దూరమయ్యాడు రాహుల్.
Also Read – సుప్రీంకోర్టుకే కుచ్చు టోపీ పెడుతున్నారే!
అదే క్రమంలో, 2024 ఐపీఎల్ లో తన కెప్టెన్సీ-బ్యాటింగ్ విధానాల పై విమర్శలతో పాటు లక్నో జట్టు ఓనర్ సైతం బహిరంగంగా రాహుల్ ను ప్రశ్నించాడు. తన కెరీర్ డిసైడింగ్ టోర్నీ
అయింది ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ కెరీర్ డిసైడింగ్ టోర్నీ లో ఏకంగా 140 బ్యాటింగ్ యావరేజ్ తో తన బ్యాటింగ్ తో భారత్ కు భరోసాలా మారాడు.
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటంలో ఎంతో కీలక పాత్ర పోషించాడు రాహుల్. సెమీస్,ఫైనల్స్ లో ఆపద్భాంధవుడిలా ఆదుకున్నాడు. ఇక ఐపీఎల్ 2025 లో తన మీద వచ్చిన స్లో బ్యాటింగ్ విమర్శలను కొట్టిపడేస్తాడా లేదా అని చూడాలి..!