భాష మారడం లేదు, ఇక రాత మార్చాల్సిందేనా?

Kodali Nani

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మాతృభాషగా ఉన్న తెలుగుకి తెగులొచ్చిందా? అన్నట్లుగా వైసీపీ నాయకుల భాష తీరు తయారయ్యింది. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం వైసీపీ నేత కొడాలి నాని భాష పై ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలే కాదు ప్రజా సంఘాలు కూడా పలు అభ్యంతరాలు తెలిపారు. అయినా ఆయన మాట తీరులో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఏపీలో బూతుల మంత్రిగా కొడాలి ప్రసిద్దిచెందారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతుగా నిజం గెలవాలి కార్యక్రమంతో భువనేశ్వరి చేప్పట్టనున్న బస్సు యాత్రను ఉద్దేశించి చేసిన నాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల బూతుల నైజాంను మరోసారి ప్రజల ముందుంచారు. టీడీపీ అధినేత చంద్రబాబుని వాడు వీడు,బాబు ఒక చీటర్, ఒక 420 గాడు అంటూ రాజకీయాలే సిగ్గు పడేలా అసభ్యకరంగా మాట్లాడడం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికీ సమంజసమా? ఇటువంటి నేతలను వెనకేసుకొస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసే మంచేమిటో ఒక సారి ఆలోచించాలి.

ADVERTISEMENT

లోకేష్ ఒక పప్పు, అందుకే తండ్రిని జైల్లో వదిలి తల్లిని రోడ్డు మీదకు పంపి ఢిల్లీ పారిపోయాడు అంటూ లోకేష్ ను కించపరుస్తూ మాట్లాడిన మాటలు రానున్న ఎన్నికలలో ఆయన రాజకీయ భవిష్యత్ కు సమాదులుగా మారతాయి అంటూన్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు, లోకేష్ పైనే కాకుండా బాబు కుటుంబం పైన కూడా కొడాలి నోరుపారేసారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రల పేరుతో వైసీపీ పార్టీని నడిపించింది షర్మిలా, విజయమ్మ కదా? వారు ఆడవారు కాదా? లేక మీరన్నట్లు మీ పార్టీలలో మగవాళ్ళు లేరా? అంటూ తెలుగు తమ్ముళ్లు నానిపై కౌంటర్ ప్రశ్నలతో ఎదురుదాడి చేస్తున్నారు

పవన్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఒక జనాసున్నా పార్టీ అంటూ పనిలో పనిగా పవన్ పై కూడా కొడాలి తన విమర్శలను కొనసాగించారు. అయితే జనసైనికులు, పవన్ అభిమానులు మాత్రం పవన్ ఉన్న వేదిక మీద కూడా కనీసం నువ్వు నిలబడలేక పోయావు. నువ్వా పవన్ ను విమర్శించేది అంటూ వంగవీటి రాధా పెళ్లి వేడుకలో కొడాలి నాని వీడియోను చూపిస్తూ నీ స్థాయి ఇదే అంటూ కొడాలికి గట్టి కౌంటర్లు వేస్తున్నారు.

నలుగురికి ఆదర్శ ప్రాయంగా నిలబడాల్సిన వ్యక్తులే ఇలా రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు పాల్పడితే అధికారంలో ఉన్నంత కాలం తాత్కాలిక ఆనందాన్ని పొందవచ్చు కానీ తిరిగి ఎన్నికలలో ప్రజల నుండి అదే ఆదరణను పొందలేకపోతే ఇక వారి రాజకీయ భవిష్యత్ ప్రజల చేతిలో సమాధి కాకా తప్పదు అనే వాస్తవాన్ని గ్రహించాలి. చంద్రబాబు ఆస్తుల గురించి ప్రస్తావించే కొడాలి ఒక్కసారి జగన్ ఆస్తుల చిట్టా కూడా చదివితే బాగుంటుంది అంటున్నారు టీడీపీ నేతలు.

అవినీతి ఆరోపణలతో చంద్రబాబుని అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం, జగన్ మీద ఉన్న అవినీతి కేసుల లిస్ట్ ఒక్కసారి చూసుకోవాలని, ఛార్జ్ షీట్లో నమోదు చేసిన జగన్ అవినీతి
ఆదాయాల చిట్టా పొద్దు ప్రజల ముందు ఉంచాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. కొడాలినాని ఫ్రేస్టేషన్లోనే ఇటువంటి నీచ రాచకీయాలకు పాల్పడుతున్నారని ఇదే ధోరణి కొనసాగిస్తే ఇక రానున్న రోజులలో కొడాలి నాని రాత మార్చడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ టీడీపీ నేతలు నానిని హెచ్చరించారు.

ADVERTISEMENT
Latest Stories