kodali-nani-

టీడీపీ హిట్ లిస్టులో జగన్‌ తర్వాత రెండో పేరు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉందనేది బహిరంగ రహాస్యమే. కారణాలు అందరికీ తెలుసు.

Also Read – జగన్‌ ఆంధ్రా పరువు తీసేస్తే.. చంద్రబాబు నాయుడు..

కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్ట మొదట ఆయతోనే కేసులు మొదలవుతాయని అందరూ అనుకుంటే, దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన జోలికి వెళ్ళలేదు.

అరెస్ట్‌ చేసి జైల్లో వేయడం కంటే అరెస్ట్‌ చేస్తారేమోననే ఆందోళన భరించడమే చాలా కష్టం. బహుశః అందువల్లే ఆయనకి గుండెపోటు వచ్చి ఉంటుంది.

Also Read – శ్యామల చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి..!

అత్యవసరంగా ముంబయి వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు కూడా. అటు నుంచి అటే ఆయన అమెరికా లేదా విదేశాలకు జంప్ అయిపోవచ్చని ముందు నుంచి అనుకుంటున్నదే.

కానీ ఆయన హైదరాబాద్‌ తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారట. ఆ చిరునామాతో మరో పాస్ పోర్టు ఏర్పాటు చేసుకొని విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కనుక ఆయనపై లుకవుట్ నోటీస్ జారీ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర రావు సీఐడీ అదనపు డీజీపీకి లేఖ వ్రాశారు.

Also Read – ఫోన్ ట్యాపింగ్: ఒక్క ట్విస్టుతో కధ క్లైమాక్స్‌కి.. భలే ఉందే!

అవినీతి కేసులలో చిక్కుకున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి పలువురు ఎదురుగా ఉన్నప్పుడు విచారణ, అరెస్ట్‌ చేయకుండా తాత్సారం చేస్తే, వారు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు.

కనుక కొడాలి నాని కూడా హైదరాబాద్‌ నుంచి విదేశాలకు జంప్ అయిపోక ముందే చర్యలు తీసుకోవాలని, ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు ఏపీ డీజీపీని లిఖితపూర్వకంగా కోరారు.




కొడాలి నాని హైదరాబాద్‌, ముంబయి లేదా అమెరికాలో ఉన్నప్పటికీ, తన గురించి మీడియాలో వస్తున్న ఈ వార్తలు తెలియకుండా ఉండవు. మామూలుగా అయితే “కేసులు, అరెస్టులకు భయపడేవాడిని కాను. దమ్ముంటే వచ్చి అరెస్ట్‌ చేసుకోండి,” అని కొడాలి నాని చెప్పేవారు. కానీ ఈ వార్తలపై ఆయన స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కనీసం వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియాలో కూడా కొడాలి నాని ప్రస్తావన వినిపించకపోవడాన్ని ఏమనుకోవాలి?