నేను చేస్తూనే ఉంటా… కొరటాల ఈజ్ ఆన్ ఫైర్..!

Koratala Siva tweet agitation against BJP Government‘మోడీని మనిషిగా మారుద్దాం’ అంటూ పిలుపునిచ్చిన ‘భరత్ అనే నేను’ దర్శకుడు కొరటాల శివ మాంచి ఫైర్ లో ఉన్నట్లుగా కనపడుతోంది. బుధవారం నాడు చేసిన ఈ ట్వీట్ అనేక చర్చలకు దారి తీయడంతో… రాజకీయంగా కొరటాల ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో మరోసారి తాను చేసిన ట్వీట్ పై వివరణ ఇచ్చుకుంటూ… తన అభిప్రాయాలు ఇక్కడితో ఆగవని మరోసారి స్పష్టం చేసారు.

“ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు మనమంతా ఒక్కటి అవుతాం, అలాంటి వైపరీత్యాలే రెండు తెలుగు రాష్ట్రాలకు సంభవించాయని తాను భావిస్తున్నానని తెలిపిన కొరటాల, రాజకీయాలు, రాజకీయ పార్టీలను పక్కన పెడితే, తాను ఓ బాధ్యత గల పౌరుడిగా తన భావాలను మొహమాటం లేకుండా, ఎలాంటి లెక్కలు వేసుకోకుండా, వ్యక్తపరిచానని స్పష్టం చేసారు. అంతేకాదు ఇలా నేను చేస్తూనే ఉంటా, రాజకీయాలు మాత్రం కాదు” అంటూ మాంచి ఫైర్ తో కూడిన సందేశాన్ని అందించాడు.

ADVERTISEMENT

చూడబోతుంటే… కేంద్ర ప్రభుత్వంపై కొరటాల విమర్శనాస్త్రాలు సిద్ధంగా ఉన్నట్లు కనపడుతున్నాయి. కాస్త వ్యంగ్యంగా సంధించినా… ప్రామిస్ ను నిలబెట్టుకునే విధంగా నిజంగానే మోడీని మనిషిగా మార్చాల్సిన అవసరం తెలుగు ప్రజలకు ఎంతైనా ఉంది. అయితే కొరటాల మాదిరి ఏపీ ప్రజానీకంలో ఉద్వేగం చెలరేగుతోందా? అన్నది ప్రశ్నార్ధకమే! ప్రజానీకం పక్కన పెడితే, కనీసం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా అయినా ఒక్కటిగా ‘స్వరం’ వినిపిస్తారా? అనేది వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories