తెలంగాణ ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను నియమించారు. ఇప్పటివరకూ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి పార్టీలో లేదు. ఈ నియామకంతో తెరాసలో నూతన అధ్యాయానికి కేసీఆర్ తెరదీశారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలన్న ఆలోచనతోనే కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు సమాచారం. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసే క్రమంలో ఇది మొదటి అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
[m9ad]
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో పాగా వెయ్యనున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు, పాలనా వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్ అత్యంత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ నియామకంపై హరీష్ రావు, ఆయన వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. పార్టీ పెట్టిన నాటినుండి హరీష్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఉద్యమ క్రమంలో కేసీఆర్ తరచుగా తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అయితే హరీష్ మాత్రం ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండే వారు. పార్టీని శ్రేణులను ముందుకు నడిపించేవారు.
ఉద్యమాన్ని ముందుకు నడిపించే క్రమంలో అనేక ఉపఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో హరీష్ ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీని గెలిపించుకుని వచ్చారు. ఇప్పటికీ ఏదైనా కీలకమైన స్థానంలో ఎన్నికలు జరుగుతుంటే కేసీఆర్ చూసేది హరీష్ రావు వైపే. ఇటీవలే సీఎం సొంత సీటైన గజ్వెల్, రేవంత్ రెడ్డి సీటైన కొడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు హరీష్. కేసీఆర్ ను భారీ మెజారిటీ తో గెలిపించడంతో పాటు రేవంత్ రెడ్డిని ఓడించడంలో ఆయన పాత్ర చాలా కీలకం. అయితే ఈ విషయంలో కేసీఆర్ కొంత తెలివిగా వ్యవహరించారు.
మీడియా దృష్టి ఎక్కువగా ఉండే ఎన్నికలకు కేటీఆర్ ను ఇంఛార్జ్ గా నియమించడం మొదలు పెట్టారు. ఆ గెలుపులను ఆయన అకౌంట్ లో వేసి మీడియా ద్వారా ప్రజలకు దగ్గర చేస్తూ వచ్చారు. హరీష్ సాధించిన విజయాల గురించి మాట్లాడేవారు మాత్రం తక్కువే. వాటికి వచ్చిన మీడియా కవరేజ్ కూడా తక్కువే. మెల్లగా కేటీఆర్ ను హై లైట్ చేసి ఇప్పుడు [పార్టీలో నెంబర్ 2 చేశారు. ఇక ముఖ్యమంత్రి స్థానం లాంఛనమే. ఈ క్రమంలో హరీష్ ఏం చేస్తారు అనేది చూడాలి. కేసీఆర్ ఈ నిర్ణయానికి ఎప్పటిలానే సర్దుకు పోయి తాను సింహాసనానికి కట్టప్పలాగా వీర విధేయుడిని అనిపించుకుంటారా లేక ఏదైనా రూపంలో తిరగబడతారా? 88 సీట్లు ఉన్న ధైర్యంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం



