ktr-at-acb-office

మాజీ మంత్రి కేటీఆర్‌ ఎఫ్-1 రేసింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కేటీఆర్‌ సోషల్ మీడియాలో పెద్ద సందేశం పెట్టారు.

హైదరాబాద్‌ ప్రతిష్టని ఇనుమడింపజేసేందుకు ఎఫ్-1 రేసింగ్ నిర్వహించాలని తాను తీసుకున్న నిర్ణయం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహించాలంటే హైదరాబాద్‌ నగరంపై ఎంతో ప్రేమ, నిబద్దత ఉండాలన్నారు.

Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?

విదేశాలకు నగదు బదిలీ అంతా పారదర్శకంగానే జరిగినప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు తనపై బురద జల్లుతున్నారని, రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. అయితే ఇటువంటి కేసులు తన ఘనతని, కీర్తి ప్రతిష్టలను ఏమాత్రం తగ్గించలేవని ట్వీట్ చేశారు.

సుప్రీంకోర్టులో కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌ వేసి ఉపసంహరించుకున్నందున ఆ పిటిషన్‌ని కొట్టివేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆయనని అరెస్ట్‌ చేయకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కనుక కేటీఆర్‌ అరెస్ట్‌ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?

ఈ నేపధ్యంలో ఈడీ కార్యాలయం వద్ద సుమారు 200 మందికి పైగా పోలీసులను మోహరించి, బ్యారికేడ్లు, వాటర్ కేనాన్‌లు ఏర్పాటు చేశారు.

కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసేందుకే ఇంత భారీ ఏర్పాట్లు చేశారని అనుమానిస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలు, ఈడీ కార్యాలయం వద్ద ‘జై కేటీఆర్‌’, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఈడీ కార్యాలయం వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?

ఇదివరకు ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితని అరెస్ట్‌ చేసినప్పుడు యావత్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతిందని వాదించారు.

ఇప్పుడు ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ని విచారణకి పిలిచినప్పుడు ఇది తన ఒక్కడి సమస్య కాదు యావత్ తెలంగాణ ప్రజల సమస్య అన్నట్లు కేటీఆర్‌ మాట్లాడుతున్నారు.

ఇద్దరూ అవినీతి ఆరోపణలలో విచారణకు హాజరైనా జైలుకి వెళ్ళినా వాటితో తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? ఏవిదంగా సంబంధం? పైగా అవినీతికి పాల్పడి దర్యాప్తు సంస్థలకి, కోర్టులకు వచ్చినప్పుడు ‘జై తెలంగాణ’ అంటూ నినాదం చేయడం సరికాదని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు.

తమ వాదనలతో కోర్టులను ఒప్పించి నిజాయితీ నిరూపించుకునే బదులు ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆదివారం శ్రీనివాస్ అన్నారు.