KTR Comments on Kavitha's Letter

కల్వకుంట్ల పార్టీలో కవిత ముసలంతో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొని ఉంది.

మరోపక్క కాళేశ్వరం కేసులో జూన్ 5,6 తేదీలలో కేసీఆర్‌, హరీష్ రావులు జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ ఎదుట విచారణకు హాజరు కావల్సి ఉంది.

Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?

అదే కేసులో నోటీస్ అందుకున్న మాజీ ఆర్ధిక మంత్రి, ప్రస్తుత బీజేపి ఎంపీ ఈటల రాజేందర్‌ జూన్ 9న కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యి అన్ని విషయాలు బయటపెడతానని బాంబు పేల్చారు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు త్వరలోనే హైదరాబాద్‌ తిరిగి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. వచ్చి నోరు విప్పితే ఈ కేసు కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం ఖాయం.

Also Read – జగన్‌ ఆంధ్రా పరువు తీసేస్తే.. చంద్రబాబు నాయుడు..

కనుక వీటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్‌ అరెస్ట్‌ అనివార్యంగానే కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత దెయ్యాలు, భూతాలు, కోవర్టులు అంటూ కేసీఆర్‌ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క హరీష్ రావు పార్టీని వీడుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటువంటి పరిస్థితులలో మరెవరైనా ఉంటే, యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టి ఉండేవారు. కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తూ ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలని ప్రయత్నిస్తుండటం విచిత్రంగా ఉంది.

Also Read – కమ్మవారి ఊసు జగన్‌ కేల?

ఓ పక్క తమ నెత్తిపై ఇన్ని కేసులుండగా, పార్టీలో ఇన్ని లుకలుకలు బయటపడుతుంటే, ‘నేషనల్ హెరాల్డ్ కుంభకోణం’పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్-షీట్‌లో సిఎం రేవంత్ రెడ్డి పేరుని పేర్కొంది గనుక తక్షణం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేస్తున్నారు.

ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పెద్దలే ఆయనని ఆ పదవిలో నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి చేయాలని కేటీఆర్‌ సూచించారు.

‘నేషనల్ హెరాల్డ్ కుంభకోణం’ గురించి గంటసేపు మాట్లాడిన కేటీఆర్‌, చెల్లి కల్వకుంట్ల కవిత వ్రాసిన లేఖ, దాని గురించి ఆమె నిన్న చేసిన వ్యాఖ్యలని మాత్రం తేలికగా కొట్టి పడేశారు.

తమ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉంది కనుకనే పార్టీలో ఎవరైనా అధ్యక్షుడుతో నేరుగా మాట్లాడవచ్చని, లేఖల వ్రాయవచ్చని, కల్వకుంట్ల కవిత కూడా అదే చేశారని కేటీఆర్‌ సమర్ధించుకున్నారు. కానీ ఇటువంటి విషయాలను బహిరంగంగా కాక కేసీఆర్‌ లేదా తనతో మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు.




ఇంటికి నిప్పంటుకుంటే ముందు ఆ మంటలు ఆర్పు కోవాలి. ఆ తర్వాత మరేదైనా. కానీ కేటీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో అంటుకున్న ‘నేషనల్ హెరాల్డ్ మంటలు’ గురించి మాట్లాడుతున్నారు.