
తెలంగాణ ఏర్పడితే ఇక తిరుగే ఉందని కేసీఆర్ వాదించి సాధించారు. తన హయంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది ఇక తిరుగులేదని కేసీఆర్ సర్టిఫై చేశారు కూడా.
కానీ ఆయన దిగిపోక ముందే ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు బీటలు వారాయి.
Also Read – అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సర్వం సిద్దం
ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఎడాపెడా చేసిన అప్పులతో ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారిందని, ఈ కారణంగా కనీసం ఉద్యోగులందరికీ నెలనెలా జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి వాపోతున్నారు.
దేశ రాజకీయాలలో గుణాత్మకమార్పు తెస్తానని చెప్పిన కేసీఆర్, సొంత పార్టీలో, సొంత కూతురు తెచ్చిన గుణాత్మకమైన మార్పుని జీర్ణించుకోవడం చాలా కష్టమే. కేవలం 11 ఏళ్ళలోనే తెలంగాణలో ఇన్ని పరిణామాలు జరిగాయి.
Also Read – బిఆర్ఎస్ బతకాలి అంటే ఏపీ చావాలా.?
కనుక ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఇంటిని, పార్టీని చక్క దిద్దుకోవడమే. ఆ తర్వాత ఓపిక ఉంటే ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు వచ్చి రాజకీయాలు చేసుకోవచ్చు. ఎన్నికలలో పార్టీని గెలిపించుకొని మళ్ళీ అధికారంలోకి రావచ్చు.
కానీ కేటీఆర్ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు కక్కుతుంటే, హరీష్ రావు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు కక్కుతున్నారు.
Also Read – యావత్ దేశం దృష్టి విశాఖ పైనే…
చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్ళను దొంగిలించుకుపోయి రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు కట్టేస్తుంతే, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చేతులు ముడుచుకు చూస్తూ కూర్చున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వడానికి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకి 50 శాతం నిధులు ఇచ్చి, ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిని పెంచి మరో 50 శాతం అప్పు చేసుకోవడానికి అనుమతించిందని హరీష్ రావు ఆరోపించారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, “తెలంగాణ వాడుకోగా మిగిలిన గోదావరి జలాలు ఏపీకి వస్తాయి. వాటిలో ఏపీ కూడా వాడుకోగా ఇంకా 200 టీఎంసీల మిగులు జలాలు సముద్రంలో కలుస్తాయి. మన రాష్ట్రంలో పారే ఆ మిగులు జలాలనే బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు మళ్లిస్తున్నాము.
కనుక ఈ ప్రాజెక్టుపై ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. ఒకవేళ ఉంటే అందరితో మాట్లాడి ఒప్పించిన తర్వాత మొదలుపెడతాము. ఇది చాలా భారీ ప్రాజెక్టు కనుక దీనిలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉండాలని కోరుతున్నాము. అందుకు కేంద్రం అంగీకరిస్తే ముందుకు వెళ్ళగలుగుతాము,” అని చెప్పారు.
కనుక బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలంటే నేరుగా దానితో పోరాడి సాధిస్తే గొప్పగా ఉంటుంది. కానీ బనకచర్ల పేరుతో ‘తెలంగాణ సెంటిమెంట్’ రాజేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం బిఆర్ఎస్ పార్టీకే చాలా అవమానకరం కాదా?