పదిహేను రోజుల్లో ప్రధానితో కేసీఆర్, కేటీఆర్ భేటీ

KTR Meets -Narendra Modiతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు భేటీ అయ్యారు. వెంటవెంటనే తండ్రీకొడుకులు ఇద్దరు ప్రధానితో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణాలో బీజేపీని బలోపేతం చెయ్యడానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఒక యాత్ర చేస్తుండగా ఈ భేటీలు జరగడం గమనార్హం.

తరువాత మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఎంతో కాలంగా తాత్సారం చేస్తున్న బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌ ఏర్పాటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కేటీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులకు పెద్దయెత్తున రాయితీలు ఇస్తోందని.. ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తే మరిన్ని రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ADVERTISEMENT

వినూత్న ఆలోచనలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేయూతనిస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు. అయితే కేవలం పరిపాలనా విషయాలు కాకుండా ఈ భేటీలో వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అని విశ్లేషకులు అనుమానపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories