
ఎఫ్-1 రేసింగ్ కేసులో తెలంగాణ ఏసీబీ స్పీడు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేటీఆర్‌కి ఎదురు దెబ్బలు తగలడం చూసినప్పుడు, ఆయనని సంక్రాంతి పండుగలోగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని చాలా మంది భావించారు. కేటీఆర్ సైతం అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అటువంటి ఆలోచన చేయకపోవడంతో కేటీఆర్ నేడు తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.
Also Read – వైసీపీ డీఎన్ఏలోనే ఏదో లోపం… ఉందా?
కానీ ఇది అల్ప సంతోషమే అని ఆయనకు కూడా తెలుసు. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దానిపై రేపు (బుధవారం) విచారణ జరుగబోతోంది.
ఈ కేసులో అవినీతి కోణంతో పాటు నిబందనలకు విరుద్దంగా విదేశాలకు బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.47 కోట్లు నగదు బదిలీ చేయడం ఆర్ధిక నేరం కూడా ఉంది కనుక సుప్రీంకోర్టు కూడా ఆయన క్వాష్ పిటిషన్ తిరస్కరించే అవకాశం ఉంది.
Also Read – వైసీపీ ఓటమికి మరో కారణం.. నిజమా?
ఒకవేళ తిరస్కరించినా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేటీఆర్‌కు ఊరట లభిస్తుంది. లేకుంటే త్వరలోనే ఏసీబీ లేదా ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమే అని భావించవచ్చు.
బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలతో సమానంగా హడావుడి చేస్తున్న మరో నాయకుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అంతే హడావుడి చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.
Also Read – రాజకీయ వివాదాల్లో టాలీవుడ్…అసలేమవుతుంది.?
ఏసీబీ పోలీసులు కేటీఆర్‌ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారనుకుంటే, పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం విశేషం. కానీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నేడు ఆయన కూడా కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.