high-court-kurnool-bench

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎటువంటి దయనీయ స్థితిలో ఉండేదో అందరికీ తెలుసు. అటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా ధైర్యంగా, నిబ్బరంగా అమరావతి రాజధాని మొదలుపెట్టి ఎన్నో పనులు, నిర్మాణాలు పూర్తి చేయించారు.

Also Read – కేసీఆర్‌, జగన్‌, రేవంత్ చారిత్రిక తప్పిదాలు… మూల్యం పెద్దదే!

కానీ చివరి రెండేళ్ళలో మారిన రాజకీయ పరిణామాల వలన ఆ పనులు పూర్తిచేయలేకపోయారు. కనుక చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని జగన్‌ ప్రచారం చేసుకొని ఒక్క ఛాన్స్ కొట్టేశారు.

చంద్రబాబు నాయుడుకి చేతకానిది జగన్‌ చేసి చూపాలి కదా?అందుకే ప్రజలు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు కదా?కానీ 5 ఏళ్ళ జగన్‌ పాలన ఏవిదంగా సాగిందో అందరూ కళ్ళారా చూశారు.

Also Read – జగన్‌ చివరి ఆశ అదే?

అమరావతి అంటే గ్రాఫిక్స్ అంటూ విమర్శించిన జగన్‌, న్యాయరాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయలేకపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేకపోయినా ఋషికొండపై 500 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకుని విశాఖ రాజధాని అంటే అవే అని వైసీపీ నేతలు నిసిగ్గుగా అందరికీ చూపించేవారు కూడా.

ప్రజలు తనకు ‘ఒక్క’ ఛాన్స్ మాత్రమే ఇచ్చారనే విషయం మరిచిపోయి ప్రవర్తించడం వల్లనే జగన్‌కు రెండో ఛాన్స్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడుకి రెండో ఛాన్స్ ఇచ్చారు.

Also Read – మంచులో అందరూ మంచివాళ్ళే కానీ…

కనుక ఆయన ముఖ్యమంత్రి కాగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ అమరావతి, పోలవరం రెండూ పునః ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కర్నూలుని న్యాయరాజధాని చేస్తామని జగన్‌ హామీ ఇచ్చి సీమ ప్రజలను మోసం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దాని ఏర్పాటుకి ఇప్పటికే రాష్ట్రంలో, ఢిల్లీలో కూడా చకచకా ఫైల్స్ కదులుతున్నాయి.

ఆరు నెలల్లోగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పనిచేయడం ప్రారంభిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. శాసనసభలో దీనిపై ప్రకటన చేయక మునుపే ఈ ప్రక్రియని ప్రారంభించామని చెప్పారు.

హైకోర్టు బెంచ్ శాశ్విత భావన సముదాయం నిర్మించేందుకు ఏడాదిన్నర సమయం పడుతుంది కనుక ఆలోగా తాత్కాలిక భవన సముదాయంలో ప్రారంభిస్తామని చెప్పారు. కర్నూలు పట్టణంలోనే లోకాయుక్త, మానవ హక్కుల కమీషన్ కార్యాలయాలు ఉంటాయని మంత్రి భరత్ చెప్పారు.




కర్నూలు ప్రజలు, రాయలసీమ ప్రజలు దీని కోసం ఎన్నో దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిలాగ మాయమాటలు చెప్పడం, న్యాయ రాజధాని పేరుతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆరు నెలల్లో సీమ ప్రజలందరూ కర్నూలులో హైకోర్టు బెంచ్ పనిచేయడం చూస్తారని మంత్రి భరత్ చెప్పారు. పని చేసే ప్రభుత్వం, పని చేసే మంత్రులు అంటే ఇదే కదా?