పవన్ పై జగన్ లక్ష్మీపార్వతి అస్త్రం

lakshmi parvathi comments on Chandrababu Naidu and pawan kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. పవన్ కళ్యాణ్ దానిపై పెద్దగా స్పందించకపోయినప్పటికీ రెండు వైపులా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇప్పుడు జనసేనాని మీద లక్ష్మీపార్వతి అస్త్రాన్ని ప్రయోగించింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ.

ADVERTISEMENT

[m9ad]

నాలుగేళ్లుగా బీజేపీ, పవన్‌ కల్యాణ్‌లకు చంద్రబాబు అవినీతి కనిపించలేదని, ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అవినీతిలో బీజేపీ, పవన్‌లకు భాగస్వామ్యం లేదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ వైపు వెళ్ళకుండా జగన్ జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తుంది.

మరోవైపు జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరిలో కొనసాగుతుంది. ఈ నెల 13న ఉత్తరాంధ్రలోకి ప్రవేశిస్తుంది. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద జగన్ ప్రజాసంకల్ప యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దీనికి అక్కడి స్థానిక నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories