
లక్ష్మీ పార్వతి శాపాలు పెడుతూ, తిట్లు లంకించుకున్నారంటే ఆరోజు ఎన్టీఆర్ జయంతో వర్దంతో అయ్యుంటుంది. ఈరోజు ఎన్టీఆర్ వర్దంతి. కనుక ఆనవాయితీ ప్రకారం ఆమె హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని, నందమూరి కుటుంబాన్ని దుష్టులు, దుర్మార్గులు అంటూ తిట్టిపోశారు. అదే.. ఆమె ఎన్టీఆర్‌కి ఇచ్చే నివాళి అనుకోవలేమో?
“ఎన్టీ రామారావుగారు అందరి ఎదుట నన్ను పెళ్ళి చేసుకుని భార్యగా గౌరవించారు. నేను కూడా నిస్వార్ధంగా ఆయనకు సేవలు చేశానే తప్ప ఏనాడూ ఒక్క రూపాయి ఆశించలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఇప్పటికీ నేను చేసిన తప్పు ఏమిటో నాకు తెలియడం లేదు.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
ఆనాటి నుంచి ఈ దుష్టులు, దుర్మార్గులు నన్ను వేదిస్తూనే ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. వారితో 30 ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నాను. ఇంకా ఎన్నేళ్ళు పోరాడాలో కూడా నాకు తెలియదు,” అని లక్ష్మీ పార్వతి అన్నారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర వ్రాస్తానంటూ ఆయన ఇంట్లో చేరి, ఆ తర్వాత ఆయన జీవితంలోకి చేరిన లక్ష్మీ పార్వతి, నందమూరి కుటుంబానికి, టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. అందుకే నందమూరి కుటుంబంలో ఏ ఒక్కరూ ఆమెను ఆయన భార్యగా తమ తల్లిగా భావించడానికి ఇష్టపడలేదు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
వారు ఇష్టపడకపోయినా ఎన్టీఆర్ వల్లనే ఆమెకంటూ సమాజంలో గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుని నిలబెట్టుకోవడం కోసమే అవకాశం వచ్చినప్పుడల్లా ఆమె ‘నేను ఎన్టీఆర్ భార్యని’ అని ప్రజలకు గుర్తుచేస్తుంటారు. కానీ ప్రజలు కూడా ఆమెను ఎన్టీఆర్ భార్యగా గుర్తించడం లేదు. గుర్తించి గౌరవించి ఉంటే నేడు ఆమె రాజకీయంగా చాలా అత్యున్నత స్థానంలో ఉండేవారు కదా?
నందమూరి కుటుంబంలో, టీడీపీలో, సమాజంలో తనకు గుర్తింపు, గౌరవం లభించనందునే ఆమె శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడనే లెక్క ప్రకారం తనలాగే చంద్రబాబు నాయుడు అమితంగా ద్వేషిస్తున్న జగన్ పంచన చేరి, వైసీపీ ముద్రతో రాజకీయాలు చేస్తున్నారు.
Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?
ఇంత తెలివిగా వ్యవహరిస్తూ నేను బాధితురాలినన్నట్లు కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్రజల సానుభూతి పొందేందుకు 30 ఏళ్ళుగా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానినే ఆమె పోరాటాలను కుంటున్నారేమో?
ఆమె ఎన్టీఆర్ జీవితంలో నాటకీయంగా ప్రవేశించి తర్వాత మెల్లగా టీడీపీని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఒకవేళ ఆమె అటువంటి దురాలోచన చేయకుండా ఉండి ఉంటే, బహుశః చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబ సభ్యులు ఆమెని ఆదరించి ఉండేవారేమో?
కానీ దూరాశకు పోయి శశికళలా నష్టపోయారు.. గౌరవం పోగొట్టుకున్నారు. తమిళనాడులో జయలలిత చనిపోగానే శశికళ ఏవిదంగా చకచకా పావులు కదుపుతూ అన్నాడీఎంకే పార్టీని వశపరుచుకుందామని ప్రయత్నించి భంగపడ్డారో, ఆదేవిదంగా లక్ష్మీ పార్వతి కూడా భంగపడ్డారు.
ఆనాడు చంద్రబాబు నాయుడు అడ్డుపడటం వలననే టీడీపీ తన చేతికి చిక్కలేదని అక్కసుతో లక్ష్మీ పార్వతి రగిలిపోతున్నారు. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి ఆమె నుంచి టీడీపీని కాపాడుకోకపోయి ఉంటే ఇంతగా ఎదిగి ఉండేదే కాదు కదా?ఆ అక్కసుతోనే ఆమె చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తున్నారని అందరికీ తెలుసు.
ఇంత తెలివిగా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి, ఆయన పోయిన 30 ఏళ్ళ తర్వాత కూడా ‘ఎన్టీఆర్ భార్య’ అనే గుర్తింపుని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ, ఇంత తెలివిగా రాజకీయాలు చేస్తున్న లక్ష్మీపార్వతికి తాను చేసిన తప్పేమిటో తెలియదని ఎలా అనుకోగలం?
అయినా ఎన్టీఆర్ జయంతి, వర్దంతి రోజున అందరూ ఆయన గొప్పదనం గుర్తుచేసుకొని నివాళులు అర్పిస్తుంటే, ఆమె మాత్రం ప్రతీసారి ఈ సందర్భాన్ని చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబ సభ్యులకు శాపనార్ధాలు పెట్టేందుకు దుర్వినియోగం చేస్తుండటం మరో పెద్ద తప్పు… కాదా?