సోషల్ మీడియాలో జనులు ఎంత షార్ప్ గా ఉంటున్నారో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఒక సంఘటనను మరో సంఘటనకు ముడిపెట్టి, తద్వారా ఫన్ సృష్టించడంలో నెటిజన్లు ఎప్పుడూ ముందువరుసలో ఉంటున్నారు. ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కిన నేపధ్యంలో… ఇటీవల కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అంటూ జగన్ ఎందుకు అన్నారో గల కారణాన్ని ఓ నెటిజన్ చేసిన సరదా పోస్ట్ వైరల్ అవుతోంది.
[m9ad]
మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల ముద్రగడ పద్మనాభంను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆతిధ్యం ఇచ్చిన ముద్రగడ, స్వయంగా లక్ష్మీ నారాయణకు వడ్డించి పెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్ లో కూడా ప్రత్యక్షమయ్యాయి. దీంతో “జగన్ కు పదహారు నెలలు చిప్పకూడు పెట్టించిన వాడికి విందు భోజనమా…. మీకూ, మీ జాతికి రిజర్వేషన్లు కట్…” అంటూ ఓ నెటిజన్ ఫన్నీ పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అవుతోంది.
ఫ్లాష్ బ్యాక్ లో జేడీకి – జగన్ కు ఉన్న అనుబంధం… అలాగే జేడీ – ముద్రగడ ఆతిధ్యం సంఘటన… ప్రస్తుతం కాపు రిజర్వేషన్లపై జగన్ తీసుకున్న స్టాండ్ తో ఈ పోస్ట్ కు మరింత ప్రాధాన్యత దక్కి కావల్సినంత ఫన్ సృష్టిస్తోంది. అందులోనూ తాను అధికారంలోకి రాగానే “రివేంజ్” తీర్చుకుంటానంటూ అందరికీ జగన్ చేసే ఆగ్రహాపూరితమైన కామెంట్స్ ఈ ‘రివేంజ్’ పోస్ట్ కు అదనపు ఆకర్షణ అయ్యింది.




