బందరులో భూములున్న వారికీ బాబు ‘బంపర్ ఆఫర్’

Machilipatnam Manginapudi-beachకృష్ణాజిల్లాలోని బందరు పోర్టు నిర్మాణం అనేది స్థానిక వాసుల కల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదిగో ఇదిగో అంటూ కొన్నాళ్ళు హడావుడి చేసారు గానీ, ఫలితం మాత్రం లేదు. అయితే స్థానిక రియల్ ఎస్టేట్ ను పెంచి పోషించడానికి మాత్రం శంకుస్థాపన చేసారు. అయితే ఆ తర్వాత ఆ శంకుస్థాపన రాయి కూడా కాలగర్భంలో కలిసిపోయింది.

కానీ, రాష్ట్ర విభజన తర్వాత బందరు నౌకాశ్రయాన్ని ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఉన్నటువంటి సముద్రపు కారిడార్ ను అభివృద్ధికి వినియోగించుకోవాలనే సిఎం నిర్ణయంతో తప్పనిసరిగా బందరులో పోర్టును నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పోర్టుకు సంబంధించి భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు, వాటి అనుబంధ సంస్థలకు కావాల్సిన భూములను ఇవ్వడానికి సంశాయిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ విషయం వివాదం కావడంతో సహజంగా ప్రతిపక్ష పార్టీ ప్రవేశించి మరింతగా రక్తి కట్టించింది. అయితే పోర్టు విషయంలో మాత్రం వెనక్కి తగ్గని చంద్రబాబు సర్కార్, తాజాగా సరికొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల మాదిరే బందరు పోర్టుకు కావాల్సిన భూములను ఇచ్చిన రైతులకు తిరిగి ప్రభుత్వం స్థలాలను ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని చెప్తూ… దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు మంత్రివర్గం ఈ సందర్భంగా ఓ నిర్ణయం తీసుకుంది. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన వారికి, అభివృద్ధి చేసిన భూమిలో వాణిజ్య, నివాస స్థలాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తూ… మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థకు భూ సమీకరణ అధికారాలు కట్టబెడుతున్నట్టు ప్రకటించింది.

ఈ ప్రకటనతో అమరావతిలో భూముల మాదిరే మచిలీపట్టణం భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లే. ఇక, భూముల లావాదేవీలతో కొన్నాళ్ళ పాటు బందరు కళకళలాడం ఖాయంగా కనపడుతోంది. సహజంగానే కృష్ణాజిల్లాలో ఉన్న భూముల ధరలు మరెక్కడా ఉండవనే ప్రచారం ఉంది. తాజా పరిణామాల నేపధ్యంలో ఆ ధరలు ఇంకాస్త ఆకాశంలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు తమ భూములు ఇచ్చేది లేదంటూ చెప్పిన రైతులే ఇక వారి వారి దస్తావేజులు పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించడం అతి త్వరలోనే వీక్షించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories