అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఇన్నాళ్లుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసింది జగన్ ప్రభుత్వం అంటున్న టీడీపీ నేతల ఆరోపణలు వాస్తవమనేలా పిన్నెళ్లి అరాచకాలు ఒక్కక్కొక్కటిగా వెలుగులోకి రానున్నాయి.
ఎన్నికల పోలింగ్ రోజు మొదలుకుని కౌంటింగ్ రోజు వరకు పల్నాడు ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అతని సోదరుడు. పోలింగ్ రోజు ఈవీఎంల ధ్వంసం మొదలుకుని పిన్నెళ్లి అరాచకాలు కౌంటింగ్ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి.
మాచర్ల పోలింగ్ బూత్లో ఈవీఎం ల ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజంట్ నంబూరి శేషగిరిరావు పై విచక్షణ రహితంగా దాడి చేయడం, అడ్డొచ్చిన చెరుకూరి నాగ శిరోమణి పై దుర్భాషలాడడం ఇవన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టినప్పటికీ న్యాయస్థానాల ముందు దోషిగా నిరూపించబడలేదు.
అయితే ముందస్తు బెయిలు పిటిషన్లతో ఇన్నాళ్లుగా కాలం నెట్టుకొస్తున్న పిన్నేల్లికి ఈ రోజుతో ఆ ఉపశమనం కూడా చేజారిపోయింది. ఆయన వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేయడంతో పిన్నెల్లి అరెస్టు అనివార్యమయింది. దీనితో కూటమి ప్రభుత్వం తన బౌలింగ్ తో పిన్నెళ్లి అనే వైసీపీ నాయకుడి తొలి వికెట్ తీసినట్లయ్యింది.
ఎన్నికల ఫలితాల ముందు వరకు నన్ను టచ్ చేసి చూడడండి, నేనేంటో చూపిస్తా, అంత సీన్ ఉందా మీకు అంటూ ఆవేశ పడిపోయిన పిన్నెల్లి నేడు అరెస్ట్ చేయడానికి పోలీస్ అధికారులు ఇంటి ముందుకు వెళితే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి పిల్లిలా బాత్ రూమ్ లో దాక్కున్నారని, అందులో వెంకట్రామిరెడ్డి గోడ దూకి పారిపోయారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఎద్దేవా చేసారు.
ఇన్నాళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని విర్రవీగిన ప్రతి ఒక్క వైసీపీ నేతకు ఇదే పరిస్థితి రానుందని, ఇప్పటికైనా ఈ పిన్నెల్లి సోదరుల బాధితులు ఉంటే ధైర్యంగా బయటకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయాలనీ సూచించారు. గత ఐదేళ్ల పాపం వీరిని జీవితాంతం జైల్లో ఉంచుతుందన్నారు పట్టాభి. గత ఐదేళ్ల వైసీపీ నాయకుల దురాగతాలకు ఇది ఆరంభం మాత్రమే అంటూ అడ్డులు దాటిన మరికొంతమంది వైసీపీ నేతలను హెచ్చరించారు పట్టాభి.




