తెలుగు సినీ పరిశ్రమలో ఓ హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా, ఎప్పుడూ ఒదిగి ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు, 2024 ఎన్నికల తంతును తన ఫార్మాలిటీ ట్వీట్స్ ను పూర్తి చేసారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, “శుభాకాంక్షలు” పేరుతో ఓ ట్వీట్ వేయడం మహేష్ కు పరిపాటి.
అయితే ఈ సారి బరిలో తన సహచర నటుడు, పవర్ స్టార్ కూడా ఉండడంతో, ‘జనసేన’ అధినేతకు అభినందనలు తెలుపుతూ, “మీ పై ప్రజలు ఎంత నమ్మకం, విశ్వాసాన్ని పెట్టుకున్నారో మీ అమోఘమైన విజయాన్ని చూస్తే అర్ధమవుతుందని, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మీరు కన్న కలలు నెరవేరాలని” ఆకాంక్ష వెలిబుచ్చారు మహేష్.
అలాగే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, శ్రేయస్సు జరగాలని, ఈ ఐదేళ్ల పాలన పూర్తిగా విజయవంతం కావాలని అన్నారు.
అంతిమంగా… వరుసగా మూడో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి కూడా అభినందనలు తెలుపుతూ, మరింత బలోపేతమైన ఇండియాను నిర్మించాలని అన్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తన ట్వీట్స్ తో ముగించారు మహేష్ బాబు.
హీరోగానే కాక, సామాజిక బాధ్యతగా తన వంతుగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్, రెండు గ్రామాల దత్తత తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నారు మహేష్. కానీ రాజకీయాలకు వచ్చేసరికి తనకు తెలియని ‘సబ్జెక్ట్’గా మాట్లాడే మహేష్, సినీ పరిశ్రమ సమస్యల కోసం వైఎస్ జగన్ దగ్గరికి విచ్చేయగా, అప్పుడు జరిగిన అవమానం అందరికీ తెలిసిందే.




