ఇంతమంది ప్రజలు వస్తారని భావించలేదన్న మహేష్!

Mahesh babu crowds Burripalemసొంతూరులో పర్యటించిన ‘బుర్రిపాలెం బుల్లోడు’ ప్రిన్స్ మహేష్ బాబుకు స్థానిక వాసులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించడం ఆలస్యం… కనకదుర్గమ్మ వారధి దాటగానే వచ్చే తాడేపల్లి హైవే వద్ద పెద్ద సంఖ్యలో అభిమాన గణం ప్రిన్స్ కు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడ నుండి మొదలైన అభిమానుల సందడి బుర్రిపాలెం వరకు రోడ్డు పొడవునా కొనసాగింది.

ఇక, ఊర్లోకి చేరుకునే సమయానికి ఆ సంఖ్య అంతకంతకూ రెట్టింపవ్వడం… ఇంటికి చేరుకున్న తర్వాత కూడా కారు నుండి దిగడానికి పది నిముషాల పాటు మహేష్ కారులోనే వేచిచూడడం వంటి పరిణామాలతో ప్రిన్స్ ఒకింత షాక్ అయ్యారు. కేవలం 3,300 మాత్రమే జనాభా గలిగిన బుర్రిపాలెంలోకి ఇంతమంది ప్రజలు వస్తారని తానూ భావించలేదని తన బావ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజాలతో ‘ఆఫ్ ది రికార్డ్’లో చెప్పినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారాలు చేసాయి.

ADVERTISEMENT

కిక్కిరిసిన జనసందోహంతో ముగ్దుడైన ప్రిన్స్, ఎవరింటికి వారు వెళ్ళిపోవాలని, తానే అందరిళ్ళకు వస్తానని పోలీసుల ద్వారా మైక్ లో చెప్పించడంతో, మహేష్ నివాసం నుండి జనాలు కదలడం ప్రారంభించారు. ప్రెస్ తో సమావేశం ముగిసిన తర్వాత ఓపెన్ టాప్ జీబ్ లో బుర్రిపాలెం వీధులలో ప్రేక్షకులను అభివాదాలు చేస్తూ ప్రిన్స్ కాన్వాయ్ కొనసాగింది.

ADVERTISEMENT
Latest Stories