‘ఐపీఎల్’ జట్టుకు మహేష్ బాబు అండదండలు!

Mahesh babu family with gujarath lions team membersక్రికెట్ అంటే మక్కువ చూపే ప్రిన్స్ మహేష్ బాబు తొలిసారిగా ఐపీఎల్ లో కనపడడం విశేషం. సురేశ్ రైనా కెప్టెన్సీలోని గుజరాత్ లయన్స్ జట్టుకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్తూ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టు ఫ్రాంచైజ్ ఓనర్ తో మహేష్ కుటుంబం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

గుజరాత్ లయన్స్ జట్టు సభ్యులతో మహేష్ తనయుడు గౌతమ్ ఉన్న ఫోటోలు ఒక్కొక్కటిగా వెలుగు చూసిన తర్వాత… తాజాగా మహేష్, నమ్రత, ఇద్దరు పిల్లలతో కూడిన ఫోటో సందడి చేస్తోంది. దీంతో గుజరాత్ లయన్స్ జట్టులో మహేష్ పెట్టుబడులు పెట్టారా? అన్న ప్రశ్నలకు తావిచ్చింది.

ADVERTISEMENT

ఇప్పటివరకు 8 సీజన్లు ముగియగా, సచిన్ ఉన్న సమయంలో మాత్రం ఒకటి, రెండు సార్లు ముంబై ఇండియన్స్ జట్టుకు అనుకూలంగా మహేష్ ట్వీట్లు చేసారు. సచిన్ అంటే ఉండే ఇష్టంతో చేసిన ప్రకటనలే తప్ప, పెట్టుబడులు పెట్టిన సందర్భాలు లేవు. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే మాత్రం గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రిన్స్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని అర్ధమవుతోంది. మరి అది కేవలం మనోబలమైనదో లేక ఆర్ధిక బలమైనదో..?

ADVERTISEMENT
Latest Stories