రెండేళ్లుగా పడిన టెన్షన్స్ కు కాలం చెల్లిపోయింది. అభిమానులు మెప్పు పొందేలా, బాక్సాఫీస్ వద్ద సానుకూల ఫలితాన్ని రాబట్టడంలో ‘భరత్ అనే నేను’ సక్సెస్ కావడంతో, ఫ్యామిలీ అంతా మరోసారి విదేశీ ట్రిప్ కు పయనమైంది. సినిమా రిలీజ్ కు ముందు ఓ వారం రోజుల పాటు విదేశీ ట్రిప్ వేసిన ప్రిన్స్, విడుదల తర్వాత ఫ్యామిలీ మొత్తం ఈ సారి పారిస్ ట్రిప్ కు వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేసి ధృవీకరించింది.
నిజానికి ఇప్పుడు మహేష్ ఉండి చేయాల్సిన పనులు కూడా ఏమీ లేవు. ప్రమోషన్స్ లో భాగంగా గత వారం రోజులుగా మీడియాలకు, టూర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. సక్సెస్ అయ్యింది కాబట్టి చెల్లించాల్సిన మొక్కులను కూడా చెల్లించేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే… ‘భరత్ అనే నేను’కు సంబంధించి మహేష్ పని మొత్తం అయిపోయింది. ఎలాగూ ఇక్కడ ఎండలు అదిరిపోతున్నాయి, తదుపరి సినిమా జూన్ లో ప్రారంభం కానుంది కాబట్టి ఈ మేలో పారిస్ నుండి ప్రిన్స్ ఫ్యామిలీ ఫోటోలు రానున్నాయి.



