వచ్చే ఏడాది వరకు ఈ చిత్రం షూటింగ్‌కు తాను సిద్ధంగా లేనని సూపర్‌స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట మేకర్స్‌కు స్పష్టం చేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఒకవేళ వారు తప్పదు అనుకుంటే, తన అవసరం లేని భాగాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆయన కోరారట.
ప్రతిరోజూ పెరుగుతున్న కేసులతో మహేష్ బాబు ఎటువంటి రిస్క్ తీసుకునే స్థితిలో లేడట. తన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారట. ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలతో కూడా సినిమా షూట్ చేయడానికి ఆయన సిద్ధంగా లేరని సమాచారం. అటువంటప్పుడు, ఈ చిత్రం 2021 సెకండ్ హాఫ్ విడుదలకు నెట్టబడవచ్చు.
గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మహేష్ సొంత బ్యానర్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ దీనిని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా ఖరారుఅయ్యిందని అంటున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ ధృవీకరించబడ్డారు.
సర్కారు వారి పాట ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పటికే చిత్రంపై అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో మహేష్ లుక్ చాలా కొత్తగా ఉంది. సరికొత్త హెయిర్ స్టైల్, చెవికి పోగు, మెడ మీద టాటూ తో మహేష్ గతంలో ఖలేజా, అతిథి టైంలో మహేష్ బాబులా కొత్తగా కనిపించాడు. దర్శకుడు పరశురాం తన కేరీర్ లోని అతిపెద్ద అవకాశాన్ని బాగానే వాడుకున్నాడు ఇప్పటికైతే.





