పూరీ జనగణమన… బ్యాక్ టు రేస్..!

Mahesh Babu -puri-jagannadh jana gna mana-movie“పోకిరి, బిజినెస్ మెన్” వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ కాంభినేషన్ గా మారిన పూరీ జగన్నాధ్ – మహేష్ బాబుల కలయికలో హ్యాట్రిక్ చిత్రంగా “జనగణమన” రాబోతోందని దాదాపుగా రెండేళ్ళ క్రితం ప్రకటించారు. ‘పోకిరి’ రిలీజ్ రోజైన ఏప్రిల్ 28వ తేదీన పూరీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా నుండి ఈ విషయాన్ని స్పష్టంగా చేయగా, మహేష్ బాబు కూడా దానిని ధృవీకరించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఊసే లేదు.

నిజానికి ఈ సినిమాను ప్రిన్స్ అశ్వనీదత్ బ్యానర్ లో చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మహేష్ తన 25వ చిత్రాన్ని అశ్వనీదత్ కు ఇచ్చేయడంతో పూరీ కాంబోలో ఇక సినిమా లేదన్న టాక్ బలపడింది. ఇంతకీ అసలు “జనగణమన” ఏమైంది? అన్న ప్రశ్న ‘మెహబూబా’ ప్రమోషన్స్ లో ఉన్న పూరీకి ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు పూరీ స్పష్టత కూడా ఇచ్చేసారు. ‘జనగణమన’ సినిమాపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదన్న క్లియర్ కట్ వైఖరి పూరీ మాటల్లో వ్యక్తమయ్యింది.

ADVERTISEMENT

అయితే అది మహేష్ బాబుతో తీస్తానా? మరొకరితోనా? అన్నది ఇప్పుడే చెప్పలేను గానీ, ఖచ్చితంగా ‘జనగణమన’ చిత్రం అయితే తీసితీరుతానని స్పష్టం చేసారు. ఈ సినిమాపై మహేష్ ఏమీ తేల్చలేదని, అందుకే ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని, కానీ ప్రస్తుత సమాజానికి ఇలాంటి సినిమా చాలా అవసరం అని, అత్యాచార ఘటనలు విన్నా, చూసినా తనకెంతో బాధ కలుగుతుందని, భారతావని సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే ‘జనగణమన’ కధ అని పూరీ చెప్పుకొచ్చారు. బహుశా ‘మెహబూబా’ ఫలితం తర్వాత దీనిపై ప్రకటన వెలువడుతుందేమో!

ADVERTISEMENT
Latest Stories