క్రేజీ సెల్ఫీ ఫోటోల కోసం ప్రాణత్యాగాలు చేసి అమరులైన వారు ఈ ప్రపంచంలో నానాటికి పెరుగుతున్నారు. ఇంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న సెల్ఫీ మాయలో స్మార్ట్ ఫోన్ వంటి అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఇక ఈ సెల్ఫీ మోజు సినీ సెలబ్రిటీల విషయంలో అయితే పతాక స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. కానీ, అలాంటి చిత్ర పరిశ్రమలో ఉండి కూడా, ఇప్పటివరకు సెల్ఫీ తీసుకోలేదంటూ తన ‘ఫస్ట్ సెల్ఫీ’ని పోస్ట్ చేసింది మంజుల.
సూపర్ స్టార్ కృష్ణ తనయురాలు, ప్రిన్స్ మహేష్ బాబు సోదరిమణి అయిన మంజుల ప్రేక్షకులకు సుపరిచితమే. ‘షో’ సినిమా ద్వారా జాతీయ అవార్డు పొందిన మంజుల, ప్రిన్స్ తో ‘పోకిరి’ తీసి ప్రభంజనం చవిచూసింది. అయితే ఇటీవల కాలంలో కాస్త దూరంగా ఉంటున్న మంజుల, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఈ తరుణంలోనే తన ఐ ఫోన్ లో సెల్ఫీ ఎలా తీసుకోవాలో తన కూతురు చెప్పిందని, అందులో భాగంగా ట్రై చేసిన ఫోటోనే ఇదని, మీరు నమ్మినా, లేకున్నా, ఇదే నా ఫస్ట్ సెల్ఫీ అంటూ పోస్ట్ చేసింది మంజుల.



