mahesh babu son gautham as Hero“1 నేనొక్కడినే” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన గౌతమ్ కృష్ణ బాలనటుడిగా మంచి మార్కులనే సంపాదించుకున్నాడు. అయితే ఆ సినిమా ఫలితం సూపర్ స్టార్ కుటుంబానికి చేదు అనుభవాన్ని మిగల్చగా, గౌతమ్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

చిన్నతనంలో ‘స్టార్’ హీరోగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న మహేష్ మాదిరే గౌతమ్ కూడా వరుసగా సినిమాలు చేస్తారేమోనని అభిమానులు భావించారు గానీ, ఆ దిశగా అడుగులు పడలేదు. భవిష్యత్తులో మాత్రం గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సంకేతాలు మహేష్ నుండి వ్యక్తమయ్యాయి.

తాజాగా ప్రసారమైన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో మహేష్ నుండి ఈ దిశగా హింట్ వచ్చింది. తన సినిమాల నిర్ణయంలో పూర్తిగా స్వేచ్ఛ తనదేనని, ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా దానికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పిన మహేష్, భవిష్యత్తులో మా అబ్బాయి కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా, గౌతమ్ కు తాను సహకారం అందివ్వబోనని అన్నారు.

ఇప్పటికిప్పుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వకపోవచ్చు గానీ, మహేష్ బాటలోనే గౌతమ్ కూడా హీరోగా రంగప్రవేశం చేస్తారన్న భావన అయితే సూపర్ స్టార్ నుండి వ్యక్తమయింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా గౌతమ్ పై ఓ డైలాగ్ వేసారు. నువ్వే డీసెంట్ అనుకుంటే, గౌతమ్ ‘డీసెంట్ కా బాప్’లా ఉన్నాడే అంటూ బాలయ్య అభివర్ణించాడు.