పిక్ టాక్ : క్రికెటర్ తో మహేష్ తనయుడు!

Mahesh babu son gautham with cricketer ajinkya rehnaప్రిన్స్ మహేష్ బాబుకు సినిమాలు కాకుండా క్రికెట్ అంటే మక్కువ అన్న విషయం అభిమానులకు తెలిసినదే. సచిన్ టెండూల్కర్ ఆట అంటే అమితంగా ఇష్టపడే మహేష్ వారసత్వాన్ని తనయుడు గౌతమ్ కూడా పుణికిపుచ్చుకున్నట్లు కనపడుతున్నాడు. హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో విక్టరీ వెంకటేష్ తో పాటు పలు సందర్భాలలో దర్శనమిచ్చిన గౌతమ్, తాజాగా ఇండియన్ క్రికెటర్ అజెంకా రేహనేతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు వెళ్ళిన సందర్భంలో రేహనేతో ఈ ఫోటో దిగినట్లుగా తెలుస్తోంది. రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరపున ధోనీ నేతృత్వంలో రెహనే ఆడుతున్నాడు. క్రికెట్ పై గౌతమ్ కున్న ఉత్సాహం చూస్తుంటే మహేష్ నట వారసత్వానికి ‘క్రికెట్’తో బదులు చెప్పేలా కనపడుతున్నాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories