మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడే వ్యక్తిత్వం మహేష్ ది కాదన్న విషయం అభిమానులకు, సినీ జనాలకు తెలిసిన విషయమే. అందులో భాగంగానే “బ్రహ్మోతవం” ఆడియో వేడుకపై ప్రిన్స్ తన అనుభూతులను పంచుకున్నాడు. చిత్ర యూనిట్ గురించి చెప్పుకొచ్చే క్రమంలో… దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి చెప్తూ…
“శ్రీకాంత్ అంటే నాకు చాలా చాలా ఇష్టం… అతను ప్యూర్ హ్యూమన్ బీయింగ్… బహుశా మన ఇండస్ట్రీ వాళ్ళతో పెద్దగా కలవరేమో… అందువలనే అంత ప్యూర్ గా ఉన్నారేమో… శ్రీకాంత్ సినిమాల కధలు ఎప్పుడు నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి… సీతమ్మ వాకిట్లో సినిమా సమయంలో ఒక మనిషిగా ఎదిగాను… ‘బ్రహ్మోత్సవం’లో మరో మెట్టు ఎదిగాను… శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక, తన అభిమానులను ఉద్దేశిస్తూ… “నేనెప్పూడూ స్టేజ్ మీద మీ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే మనకు ఎవరి మీదైనా నిజంగా ప్రేముంటే… అది మాటలతో వివరించలేము… మీరు నా కెరీర్ ను సపోర్ట్ చేసి నన్ను ఇంతవాడ్ని చేసినందుకు కృతజ్ఞతలు… మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు… మే 20న మనందరికీ ‘బ్రహ్మోత్సవాలు’ మొదలవబోతున్నాయి… మనందరికీ పెద్ద పండగలా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ప్రిన్స్ తన ప్రసంగాన్ని ముగించారు.



