మహేష్ ఫ్యాన్స్ లో టెన్షన్, ఆగ్రహం!

Mahesh Bbau - Sarkaru Vaari Paata“సర్కార్ వారి పాట” సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సరిగ్గా ఇదే సమయానికి వచ్చే నెలలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ ప్రొడక్షన్స్ ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తుండడంతో, సూపర్ స్టార్ అభిమానుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది.

ADVERTISEMENT

ఇంతకీ మే 12వ తేదీకి “సర్కార్ వారి పాట”ను విడుదల చేసే ఉద్దేశం ఉందా? లేదా? అనే టెన్షన్ లో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అనేక వాయిదా తర్వాత ఎట్టకేలకు మే 12కి ముహుర్తాన్ని ఖరారు చేసారు. విడుదలకు నెల రోజుల సమయమే మిగిలి ఉండడం, చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఒకవేళ చెప్పిన సమయానికే రిలీజ్ చేసే ఉద్దేశం ఉంటే, కనీసం ప్రమోషన్ మెటీరియల్ అయినా ఇవ్వాలి కదా అనేది ఫ్యాన్స్ ఆగ్రహం. షూటింగ్ ఇంకా మిగిలి ఉంది గనుక, ఈ లోపున పాటలనైనా రిలీజ్ చేయొచ్చనేది అభిమానుల ఆకాంక్ష. ఇప్పటివరకు కేవలం 2 పాటలే విడుదలయ్యాయి గనుక, ఇంకా సినిమాలో మూడు పాటలు మిగిలి ఉన్నాయి గనుక, వాటిని ఒక్కొక్కటిగా విడుదల చేస్తే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరు కదా అని ఆవేదన చెందుతున్నారు.

మహేష్ బాబు ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలకు, చేస్తోన్న విజ్ఞప్తులకు మైత్రీ నుండి ఎలాంటి స్పందన లేదు. గతంలో సంగీత దర్శకుడు థమన్ అయినా ఫ్యాన్స్ కోసం ట్వీట్స్ చేసేవారు, ఇప్పుడు అది కూడా కొరవవ్వడంతో, అభిమానుల ఆగ్రహాం కట్టలు తెంచుకుంటోంది. మైత్రీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో, షూటింగ్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసుకుని సంతృప్తి చెందుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories