
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను రాజకీయాలు చేసే స్టయిలే వేరు…. అని నేడు మరోసారి నిరూపించారు.
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో జరుగుతున్నా నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎన్డీయేతర పార్టీల ముఖ్యమంత్రులు అందరూ బహిష్కరించారు. కానీ ఆమె ఒక్కరే హాజరయ్యారు! కానీ సమావేశం మద్యలో బయటకు వచ్చేశారు!
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
ఇంతకీ ఏం జరిగిందంటే, మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నీతి ఆయోగ్ వలన ఎటువంటి ఉపయోగమూ లేదని కనుక మళ్ళీ ఇదివరకులా పంచవర్ష ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. కేంద్ర బడ్జెట్‌లో బీజేపీయేతర రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదంటూ మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.
ఆమె ప్రధాని మోడీని విమర్శిస్తుండటంతో నిర్వాహకులు ఆమె మైక్ కట్ చేశారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైన తాను మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడం అవమానంగానే భావిస్తున్నానని, అందుకే సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశానని మమతా బెనర్జీ అన్నారు.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
దేశంలో ప్రతిపక్షాల తరపున ఎవరూ ఈ సమావేశానికి రాకపోయినా తాను మాత్రం వచ్చి ప్రతిపక్షాల గొంతు వినిపిస్తుంటే దానినీ వినకుండా నొక్కేశారని, ఈ మాత్రం దానికి సమావేశానికి పిలవడం దేనికని ప్రశ్నించారు. ఎన్డీయే ముఖ్యమంత్రులు ఒక్కక్కరూ 20 నిమిషాలకు పైగా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని, కానీ తనకు 10 నిమిషాలు కూడా ఇవ్వకుండా మైక్ కట్ చేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించడం వలన సాధించింది ఏమీ లేదు. కానీ మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరయ్యి, ఎన్డీయే ముఖ్యమంత్రుల సమక్షంలోనే ప్రధాని మోడీని ధైర్యంగా విమర్శించారు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన్నట్లు స్పష్టంగా చెప్పగలిగారు.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
అందుకు ఆమె మైక్ కట్ చేస్తే, సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేసి మీడియాతో మాట్లాడి యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకోగలిగారు.
అదే… కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ సమావేశానికి హాజరై ఆమెలాగ ధైర్యంగా వివక్ష తగదని చెప్పి ఉండి ఉంటే, అప్పుడు ప్రధాని మోడీ ఇబ్బంది పడి ఉండేవారు. కానీ వారు ఈ సమావేశాన్ని బహిష్కరించి తమకు లభించిన ఈ గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నారు. ప్రధాని మోడీకి ఇబ్బంది తప్పించారు.
కానీ మమతా బెనర్జీ మాత్రం ఆడ పులిలా సమావేశంలో గర్జించి వచ్చారు. అందుకే మమతక్క రాజకీయాలు చేసే స్టయిలే వేరు.