Mamata Banerjee

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళు పూర్తయినప్పటికీ, నిర్భయ వంటి కటిన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ దేశంలో ఇంకా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉండటం, వాటిపై రాజకీయాలు జరుగుతుండటం చాలా బాధకరం. కోల్‌కతాలో ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్‌పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!

ఇదే హేయమైన నేరమనుకుంటే, హత్యాచారం జరిగిన అదే హాస్పిటల్‌పై కొందరు దుండగులు దాడి చేయడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

ఇంకా దిగ్బ్రంతి కలిగించే విషయం ఏమిటంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనరీ దీనిపై రాజకీయాలు చేస్తున్నారు!

Also Read – అందరి చూపు, నాని HIT వైపే

హాస్పిటల్‌పై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆరోపిస్తూ ఆమె నిన్న పార్టీలో మహిళలతో కలిసి కోల్‌కతాలో నిరసన ర్యాలీ చేశారు. అది చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి చేతిలో యావత్ పోలీస్, నిఘా వ్యవస్థలు ఉంటాయి. కనుక ఈ నేరంపై తక్షణం విచారణ జరిపించి దోషులను పట్టుకొని కోర్టుకి అప్పగించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. కానీ ఈ ఘటనకు పూర్తి బాధ్యత స్వీకరించాల్సిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రోడ్లపై నిరసన ర్యాలీ నిర్వహించడం, రాజకీయాలు చేస్తుండటం అత్యాచారం కంటే హీనంగా అనిపించక మానదు.

Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?

హత్యాచారం జరిగిన హాస్పిటల్‌పై దాడి జరగడం కూడా ప్రభుత్వ వైఫల్యమే అని కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది. హాస్పిటల్‌ ఎదుట సుమారు 7000 మంది గుమిగూడినప్పుడు, పోలీసులకు తెలియదని చెప్పడం బాధ్యతారాహిత్యమే అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హత్యాచారం, దాడి ఘటనలపై వేర్వేరుగా 48 గంటలలో నివేదికలు సమర్పించాలని రాష్ట్ర డిజిపిని ఆదేశించింది.




భారత్‌ వైద్య సంఘం (ఐఎంఏ) పిలుపు మేరకు ఈ హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్‌లో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలసేపు అత్యవసర వైద్య సేవలు నిలిపివేశారు.