వైఎస్సార్ బయోపిక్… మమ్ముట్టి లేరు… నయన కాదు..!

mammootty-not-playing-in-ysr-biopic‘ఆనందో బ్రహ్మా’ చిత్ర ద్వారా కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించబోతున్నారని, అలాగే నయనతార మరో కీలక పాత్రలో నటిస్తున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇవన్నీ పుకార్లేనని చిత్ర దర్శకుడు రాఘవ్ స్పష్టం చేసారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఇది పూర్తయిన తర్వాతే చిత్ర తారాగణం ఎంపిక జరుగుతుందని, తాము ఇప్పటివరకు ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని, ఎవరెవరూ నటిస్తున్నారో తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేసారు. 70ఎంఎం బ్యానర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి, నయనతారలపై స్పష్టత వచ్చినట్లే.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories