ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ యువతులతో ఆశ్లీలంగా కెమెరాలకు చిక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సందీప్ కుమార్ ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్నాడు. ఈ విచారణలో భాగంగా కొన్ని నిజాలను వెల్లడించాడంటూ జాతీయ మీడియాలో సమాచారం హల్చల్ చేస్తోంది. “యువతులతో వివిధ భంగిమల్లో ఉన్న సీడీలను తయారు చేసిన తన వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అని, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశాడని” సందీప్ కుమార్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఈ సీడీలను పలువురికి ప్రవీణ్ పంచాడని పోలీసుల విచారణలో ఉన్న సందీప్ వెల్లడించినట్టు సమాచారం. సందీప్ కు చెందిన రెండు సీడీలు వెలుగులోకి రావడం, వీటిల్లో ఆయనతో ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కల్పించుకుని క్యాబినెట్ నుండి సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆపై వీడియోలో కనిపిస్తున్న యువతి, తనకు మత్తుమందిచ్చిన సందీప్ అత్యాచారం చేశాడని కేసు పెట్టడంతో, సందీప్ ను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.



