Manchu Family Feud Reignites Again

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు తన ఇంటి పేరు (మంచు) చెప్పుకోకుండానే కలెక్షన్ కింగ్‌, డైలాగ్ కింగ్‌, పద్మశ్రీ వంటి గుర్తింపులు పొందారు. కానీ ఆయన నీడలో సినీ హీరోలుగా ఎదిగిన మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ కూడా ఇంటి పేరుతో, ఆ తండ్రి కొడుకులుగా మాత్రమే గుర్తింపు పొందారు. ఒకవేళ వారి పేర్ల ముందు ‘మంచు’ వారి వెనుక మోహన్ బాబు లేకపోతే వారిని గుర్తించేవారే ఉండకపోవచ్చు.

మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ అనేక ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ చెపుకోదగ్గ విజయాలు సాధించలేకపోయారు.
మనోజ్ మంచివాడు కాడని భావిస్తే విష్ణు వెనక్కు తగ్గొచ్చు లేదా విష్ణు మంచివాడు కాడని భావిస్తే మనోజ్ వెనక్కు తగ్గొచ్చు. కానీ ఇద్దరూ మేమే మంచివాళ్ళమని చెప్పుకుంటూనే తండ్రి కష్టార్జితంతో సంపాదించిన ఆస్తుల కోసం కీచులాడుకుంటున్నారు. తండ్రి పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ, తల్లి తండ్రులకు తీరని మనోవేదన కలిగిస్తున్నారు.

Also Read – చంద్రబాబు నాయుడు @75: అదే పోరాటస్పూర్తి

మంచు విష్ణు తన కారుని దొంగిలించాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మనోజ్ పిర్యాదు చేయడంతో మళ్ళీ ఈ మంచు తుఫాను మొదలైంది.

ఈరోజు ఉదయం జల్‌పల్లిలో తండ్రి ఇంటి ముందు మనోజ్ నిరసన దీక్ష చేపట్టడంతో అక్కడ మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కనుక మళ్ళీ భారీగా పోలీసులు మోహరించారు.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ, “ఎవరి సత్తా ఏమిటో వెండితెరపైనే చూసుకుందామని నేను విష్ణుకి సవాలు విసిరి, నా ‘భైరవం’ సినిమాని విడుదల చేస్తున్నాను. దాంతో విష్ణు భయపడిపోయి ‘కన్నప్ప’ని (జూన్ 27)కి వాయిదా వేసుకున్నాడు.

ఆ కోపంతో ఏమి చేయాలో తెలియక డూప్లికేట్ కీతో నా కారుని ఓపెన్ చేసి ఎత్తుకుపోయాడు. దమ్ముంటే నేరుగా నన్ను ఎదుర్కోవాలి కానీ ఇదేం నీచమైన పనులు?

Also Read – సంగీతంలో లెజెండ్ – మీడియా అంటే ఆమడ దూరం. వివాదాల భయమా?

విష్ణు నా కంటే 4 ఏళ్ళు పెద్దవాడు. కనుక వస్తే పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని నేను పదేపదే పిలుస్తున్నా విష్ణు తప్పించుకు తిరుగుతున్నాడు. నన్ను ధైర్యంగా ఎదుర్కోలేక ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నాడు. నా తల్లి తండ్రులకు ఈ వయసులో ఈ అశాంతి, మనోవేదన అవసరమా?” అని మంచు మనోజ్ ప్రశ్నించారు.