
ఎవరు అవునన్నా కాదన్నా మంచు కుటుంబలో తుఫానుకి ప్రధాన కారకుడు మంచు మనోజ్. తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన మంచు మనోజ్ వల్లనే తాను ఇన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
బహుశః మోహన్ బాబు తన కొడుకు మనోజ్ విడాకులు తీసుకొని తాను ప్రేమించిన భూమా మౌనికని రెండో పెళ్ళి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన్న మోహన్ బాబు దంపతులు కొడుకు-కోడలిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారంటే నమ్మశక్యంగా లేదు.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
కనుక మంచు మనోజ్, మౌనికల విషయంలో వారి అసంతృప్తికి ఆస్తులు, ఈ పెళ్ళిళ్ళు మాత్రమే కాక వేరే ఇతర కారణాలు కూడా ఉండి ఉండొచ్చు. అవి అప్రస్తుతం.
ఈరోజు మంచు మనోజ్ తన భార్యని వెంటబెట్టుకొని తిరుపతి, మోహన్ బాబు యూనివర్శిటీ ఆవరణలో ఉన్న తన తాత, నాయనమ్మల సమాధుల వద్ద పూలు, పళ్ళు, బట్టలు సమర్పించాలని వచ్చారు.
Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!
వారిరువురే వచ్చి ఉండి ఉంటే అర్దం చేసుకోవచ్చు. కానీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తమ అనుచరులు బైక్‌లతో అనుసరించగా ఊరేగింపుగా అక్కడకు చేరుకున్నారు. ఊహించిన్నట్లే పోలీసులు వారిని అడ్డుకొని తిప్పి పంపించేశారు.
అక్కడి నుంచి వారిరువురూ నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న మంత్రి నారా లోకేష్ ఇంటికి వెళ్ళి కాసేపు వారితో సరదాగా గడిపి వెళ్ళారు. భూమా మౌనిక టీడీపీకి చెందినవారు కనుక భర్తతో కలిసి వెళ్ళి నారా లోకేష్ కుటుంబాన్ని పండగపూట పలకరించడం తప్పు కాదు.
Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?
కానీ మోహన్ బాబుకి, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు వైసీపీతో బలమైన సంబంధం, బంధుత్వాలు కూడా ఉన్నందున వారి ఇంట్లో గొడవలకు ఈ రాజకీయాలు కూడా ఒక కారణమని, జల్‌పల్లి నివాసంలో అన్నదమ్ముల మద్య గొడవలు జరుగుతున్నప్పుడు, వారికి మద్దతుగా రెండు పార్టీలకు చెందినవారు మోహరించారని ఆ మద్యన వార్తలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో మంచు మనోజ్ దంపతులు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి నేరుగా నారా లోకేష్ ఇంటికి వెళ్ళడం, నారా లోకేష్ దంపతులు వారిని ఆప్యాయంగా పలకరించి సాగనంపడం తప్పుడు సంకేతాలు పంపించిన్నట్లవుతుందేమో?
మంచు మనోజ్ దంపతులు ఈరోజు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయే ముందు మరోసారి మోహన్ బాబు యూనివర్సిటీలో తాత, నాన్నమ్మల సమాధులు సందర్శించుకునే ప్రయత్నం చేస్తారని సమాచారం.
అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా ఎవరికీ మంచిది కాదు. కనుక మంచు మనోజ్ దంపతులు తమ వలన టీడీపీకి చెడ్డపేరు రాకుండా హుందాగా తిరిగి వెళ్ళిపోతే అందరికీ మంచిది.