భజన ప్రతిదానికి భజన! అయితే ఎవరికీ గొప్ప!

Margani Bharat Compares Jagan With Lord Maha Vishnu

వైసీపీ నాయకులు తమ అధినేతను మెప్పించడానికి ఏస్థాయికైనా దిగజారగలరని అలాగే ఏ స్థాయికైనా ఎగబడగలరని ఎన్నో సందర్బాలలో నిరూపిస్తూనే వస్తున్నారు.తాజాగా వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఏపీ ప్రజలకు విష్ణు మూర్తి అవతారంలో మరో కొత్త అవతారాన్ని ప్రజలకు తెలియచేసారు.

టీడీపీ నేతలు బాబుకి మద్దతుగా “జగనాసుర దహనం” అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి అందరికి విదితమే. అయితే సదరు ఎంపీ గారికి మాత్రం ఈ కార్యక్రమంతో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ సరికొత్త వాదన తెరమీదకు తెచ్చారు.ఇటువంటి కార్యక్రమాలపై హిందుత్వవాదులు అని చెప్పుకునే బీజేపీ,ఆర్ఎస్ఎస్ లు ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఖండించలేదు? అంటూ మార్గాన్ని మండిపడ్డారు.

ADVERTISEMENT

‘జగనా’సుర అంటూ ఎలా అంటారు,అందులో జగన్, జగన్ మోహన్ అంటే ఏమిటి? జగన్ అంటే సాక్ష్యాత్తు శ్రీ మహా విష్ణువు అవతారం, మహా విష్ణువు అంశ….,అంటూ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరి కళ్ళు తెరిపించారు వైసీపీ ఎంపీ భరత్.అసలు ఇటువంటి కార్యక్రమాలను హిందూ సాంప్రదాయ పెద్దలు ఎందుకు ఖండించలేదో అర్ధంకావడం లేదంటూ తెగ భాదపడిపోయారు భరత్.

గతంలో కూడా లోకేష్ దొంగ మోహన్ రెడ్డి అంటూ విమర్శించేవారు, అసలు దేవుడి పేరుని ఇలా ఎలా అపహాస్యం చేస్తారు. సంస్కృతీ – సంప్రదాయాలు – హిందుత్వం – సనాతన ధర్మం అంటూ చాల పెద్దపెద్ద పదాలే వాడేశారు మార్గాన్ని. దేవుడి పేరు ఎవరుపెట్టుకున వారిని విమర్శించకూడదని ఎంపీ గారు చెపుతున్నారా? లేక జగనే విష్ణు మూర్తి అవతారం అని చెప్పాలనుకున్నారా? ఎదో చెప్పాలని మరేదో చెప్పి తానూ ఇరుక్కోవడమే కాదు తన ప్రభుత్వాన్ని కూడా గట్టిగానే ఇరికించారు భరత్.

ప్రతిపక్షలకు తాళం ఇస్తే ఇంకా ఇంటి గుట్టు తవ్వకుండా ఉంటారా మరి? నాలుగేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఏన్ని హిందూ దేవాలయాల పై దాడులు జరిగాయి? ఎన్ని దేవదాయల రథాలు అగ్నికి ఆహుతయ్యాయి?ఎన్ని దేవాలయాలలో విగ్రహాల ధ్వంసం జరిగింది? ఎంతమంది మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది? అందులో ఎంత మందికి శిక్షలు ఖరారయ్యాయి అంటూ నాలుగేళ్ళ వైసీపీ చరిత్ర మొత్తం మరోసారి ప్రజలలో చర్చకు తెచ్చారు.

గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో హిందుత్వం పై ఇన్ని అరాచకాలు జరిగితే నోరువిప్పని ఈ ఎంపీ గారు ఏ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నారో అంటూ జనసేన నేతలు ట్రోల్స్ చేస్తున్నారు.తమ అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి చివరకు దేవుళ్లను కూడా వదిలి పెట్టారా అంటూ శ్రీవారి భక్తులు ఎంపీ వ్యాఖ్యల పై మండిపడుతున్నారు.ఏడుకొండల వాడి సాక్షిగా మార్గాన్ని భరత్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని వెంకన్న భక్తులకు తక్షణం క్షమాపణలు చెప్పాలంటూ తిరుపతి జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే శ్రీవారి భక్తులు కూడా మీ అధినేత అయితే ఎవరికీ గొప్ప? మీ అధినేతకు భజన చేసుకుంటే చేసుకోండి, అంతేకాని ఆ భజనలో భగవంతులను తీసుకురావద్దు అంటూ ఎంపీ భరత్ ను కాస్త గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అయితే నా పేరు “భరత్ నేను శ్రీ రాముడి తమ్ముడి అంశ” అంటారే కాస్త చూసుకోండి భక్తులారా! ఇలా అయితే ప్రతి వ్యక్తి పేరులో ఎదో ఒక దేవుడి అంశ ఉంటుందిగా! ఇక రాష్ట్రంలో ప్రతి వాడు దేవుడి అంశే అనుకుంటా.

ADVERTISEMENT
Latest Stories