ఇప్పట్లో ‘మత్తు వదిలేలా’ లేదుగా..?

Mathu Vadalara 2 OTT

2019 లో రితేష్ రాణా దర్శకత్వం వహించిన ‘మత్తు వదలరా’ చిత్రం రిలీజ్ కు ముందు పెద్ద హడావుడి చేయకున్నా, ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి హాజరుకావటం తో ప్రజలలో సినిమా పై ఆసక్తి పెరిగింది. క్రిస్మస్ సందర్భంగా 25 డిసెంబర్ 2019 న విడుదలైన ‘మత్తు వదలరా’ మంచి కామెడీ ట్రాక్ ఉన్న ఫస్ట్ హాఫ్ తో, అద్భుతమైన క్లైమాక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు, సినిమా మధ్య మధ్య లో దర్శనం ఇచ్చే “రత్న-వాళ్ళ ఆయన” యొక్క సీరియల్ కామెడీ ట్రాక్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ గా ఏర్పడ్డారు. క్లైమాక్స్ లో సినిమా కు ఉన్న ట్విస్ట్ తో పాటు, ‘వడ దెబ్బ’ ట్విస్ట్ కూడా ప్రేక్షకుల ఆకర్షణ ను పొందింది. అంత మంచి పేరు వచ్చిన ఆ సీరియల్ ను సెకండ్ పార్ట్ లో కూడా కొనసాగించారు.

ADVERTISEMENT

మొదటి పార్ట్ లో కూడా హైలైట్ గా నిలిచిన కామెడీ ట్రాక్ ని నమ్ముకునే, డైరెక్టర్ రితేష్ రాణా మరోసారి ఒక కామెడీ-థ్రిల్లర్ జోనర్ లో ‘మత్తు వదలరా-2’ అంటూ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసారో కూడా తెలియకుండా ఒకేసారి సినిమా రిలీజ్ అంటూ మీడియాలోకొచ్చారు. 13 సెప్టెంబర్ న రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి పార్ట్ చూసిన అభిమానులు, అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ను ఆశించి థియేటర్లలోకి వెళ్లగా, ఆ అంచనాలను అందుకోవటం లో దర్శకుడు రితేష్ సక్సెస్ అయ్యారు. మంచి మీమ్ రెఫరెన్సులతో, సత్య కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉండటం, సీరియల్ ట్రాక్ మళ్ళీ ఆకట్టుకోవడం, మెయిన్ లీడ్స్ మంచి పెర్ఫామెన్స్, ఇలా అన్ని కోణాల్లోనూ చక్కగా ఉండటం తో మళ్ళీ హిట్ అందుకున్నారు రితేష్.

వెండితెర మీద సినీ ప్రముఖులు చిరు, మహేష్ వంటి వారి స్టార్స్ ప్రశంసలు దక్కించుకున్న ఈ మత్తువదలరా తాజాగా నెట్ ఫ్లిక్ ఓటిటీ వేదికగా విడుదలై అక్కడ కూడా టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతుంది. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం అందుకున్న మూవీలలో మత్తువదలరా ఒకటిగా నిలిచిందనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా, ఇంస్టాగ్రామ్ మరియు ఎక్స్ వంటి సామజిక మాధ్యమాల్లో ‘రియా ఎక్కడ?’ అనే సత్య-అజయ్ ల కామెడీ ట్రాక్ హల్చల్ చేస్తుంది. ఏ పోస్ట్, ట్వీట్ కిందకి వెళ్లినా మొదట కనపడే కామెంట్ గా ‘రియా ఎక్కడ?’ డైలాగ్ కనిపిస్తుంది. తెలుగు యువత సినిమా ను బాగా అందుకున్నారు అనేందుకు ఇంతకు మించి వివరణ అవసరం లేదు. ఇలా, తెలుగు యువత కు ఇప్పట్లో ఈ రియా ఎక్కడ అనే ‘మత్తు వదిలేలా’ కనపడుటలేదు.

ADVERTISEMENT
Latest Stories