
ఈ మధ్యకాలంలో మంచు వారి కుటుంబ మంటలు హైద్రాబాద్ లో రచ్చ లేపిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు vs మనోజ్ అన్నట్టుగా సాగుతున్న ఈ మంచు వారి కుటుంబ వివాదాలు కేసులతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి.
అలాగే అసలు ఈ వివాదానికి ఆజ్యం పోసిందెవరు అని కనిపెట్టే పనిలో మోహన్ బాబు ముందుకెళ్లిన ఒక ప్రముఖ టీవీ ఛానెల్ జర్నలిస్ట్ పై మోహన్ బాబు మైక్ తో దాడి చేయడం ఇక ఆతరువాత జరిగిన పరిణామాలన్నీ అందరికి విదితమే.
Also Read – ప్రభుత్వంపై ఆధారపడమంటారు జగన్.. వద్దంటారు చంద్రబాబు!
అయితే ఆ దాడి కాస్త మరో వివాదంగా మారడంతో కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ బాబు ఆ తరువాత మీడియా ముందుకొచ్చి జరిగిందేదో జరిగిపోయింది…ఇక పై జరగాల్సింది చూద్దాం అంటూ పెద్దరికమైన ప్రకటనలు చేసారు.
దీనితో మంచు వారి ఇంట మొదలైన వివాదాల మంటలు ఇక చల్లారినట్టే అనుకున్న తరుణంలో ఇప్పుడు తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రికత్త వాతావరణం నెలకొంది. సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి హైద్రాబాద్ నుంచి ఏపీ వచ్చిన మోహన్ బాబు తిరుపతి తన యూనివర్సిటీని సందర్శించారు.
Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!
ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ రేణుగుంట ఎయిర్ ఫోర్ట్ నుంచి శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీకి భారీ ర్యాలీగా బయలు దేరారు. అయితే ఇప్పటికే ఆ విద్యానికేతన్ వద్ద మోహన్ బాబు అతని పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. ఇప్పుడు మనోజ్ కూడా తన బలగంతో అక్కడకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు.
దీనితో మళ్ళీ వీరంతా ఒకే చోట చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయో అంటూ అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాగే మంచు వారి వివాదంలో మైకు పెట్టి మరో మోహన్ బాబు భాదితుడిగా మారే సాహసం మీడియా వారు చేస్తారా.? ఒకవేళ ఆ సాహసానికి ఒడిగట్టినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీడియా మిత్రులకు మంచిది.
Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?