నేడు వెలగపూడి సచివాలయం సమీపంలో జరిగిన మెగా డిఎస్సి సంబరాలు కూటమి ప్రభుత్వ పాలనకు అద్దం పట్టాయి అంటున్నారు డిఎస్సి నియామక సభ్యులు. ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో మెగా డిఎస్సి నిర్వహించి, నియామక పాత్రలను అందించడం కూటమి విజయం అంటున్నారు మంత్రి లోకేష్.
ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సుమారు 16 వేలమందికి నియామక పత్రాలు అందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొన్నగా, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన జీవిత కాల గురువు చంద్రబాబు నాయుడే అంటూ పేర్కొన్నారు.
అలాగే ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు 150 రోజులలో 150 కేసులు వేసినా మెగా డిఎస్సి నియామక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేశామని, విద్యా శాఖ మంత్రిగా తన శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, చాగంటి కోటేశ్వర్ రావు వంటి ఆధ్యాత్మిక ప్రవచనకర్తలకు క్యాబినెట్ ర్యాంకు కల్పించామని ఇవన్నీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ పేర్కొన్నారు లోకేష్.
ఇక సూపర్ సిక్స్ హామీలలో మొదటిగా మెగా డిఎస్సి మీదే ద్రుష్టి పెట్టి, ముఖ్యమంత్రిగా తన తొలి సంతంకం కూడా ఈ హామీ అమలు మీదే పెట్టనంటూ, ఇది తనకు విద్యా వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని, భరోసాకి అద్దం పడుతుందన్నారు బాబు. నేటితరం భవిష్యత్ గురువుల చేతిలోనే రూపు దిద్దుకుంటుందని అది వారిని సన్మార్గంలో నడిపించేలా ఉండాలంటూ పేర్కొన్నారు బాబు.
అయితే మొత్తం 3.36 లక్షల మంది అభ్యర్థులలో 15,941 మంది మెరిట్ ఆధారంగా ఎంపిక కాగా 421 సీట్లలో మహిళలు, SC,ST,BC, PWBD, మాజీ సైనికులు మరియు క్రీడాకారులకు రిజర్వేషన్ అమలు చేసారు. అయితే నాడు వైసీపీ ప్రభుత్వంలో గురువులు వైన్ షొపుల ముందు నిల్చుని అవమానింపబడగా నేడు అదే గురువులు గౌరవింపబడుతున్నారు.




