బ్రేకింగ్ : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం!

mekapati goutham reddy passed awayగడిచిన వారంలో దుబాయ్ కు వెళ్లి ఏపీకి 5000 కోట్లు పైచిలుకు పెట్టుబడులు తీసుకువచ్చామని చెప్పిన ఐటీ మరియు పారిశ్రామిక శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి నేడు తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు.

అయితే వైద్యుల ప్రయత్నం ఫలించకపోవడంతో 49 ఏళ్ళ గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులకు షాక్ కు గురిచేసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తోన్న మేకపాటి గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికలలో కూడా విజయం సాధించారు.

ADVERTISEMENT

ఊహించని ఈ పరిణామంతో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా విషాదంలో మునిగిపోయాయి. ఒక వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొని ఆదివారం హైదరాబాద్ చేరుకోగా, సోమవారం ఉదయం నాటికి దుర్వార్త వినాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories