విశాఖపట్నంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ వంచన వ్యతిరేక దీక్ష సందర్భంగా నెల్లూరు ఎంపీ రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని అయోమయానికి అడ్డం పడుతుంది. పార్టీ ఎంతో ఘనంగా ప్రకటించిన నవరత్నాలపై ఆ పార్టీ ఎంపీకే పూర్తి వివరాలు తెలియకపోవడం విశేషం.
రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా వికలాంగులకు 3000 రూపాయిలు పెన్షన్ ఇస్తాం అని చెబుతూనే జగన్ 2000 ఇస్తాం అన్నారా 3000 ఇస్తాం అన్నారా అని ఒకటికి పదిసార్లు పక్కన వారిని అడగడం మైక్ లో స్పష్టంగా వినిపించింది. ఎవరో 2000 అని అందివ్వగా సరే ఆయన 2000 ఇస్తాం అన్నారు సరే ఆ 2000 వస్తుంది మీరేమి దిగులు పడకండి అంటూ కవర్ చేసుకున్నారు.
నవరత్నాలతో అధికారంలోకి రావడం గారంటీ అని జగన్ కచ్చితంగా నమ్ముతున్నారు. అటువంటి కార్యక్రమం వివరాలు కూడా ఆ పార్టీ ఎంపీలకే తెలియలేదు అంటే దానిని వారు ఏ విధంగా ప్రజలలోకి తీసుకునివెళ్ళగలరు అనేది ఆ పార్టీ అభిమానులకు కూడా అంతు పట్టకుండా ఉంది.



