బిజెపి వారు ఎంత అభ్యర్ధించినా జగన్ పొత్తుకు ఒప్పుకోలేదట

mekapati-rajamohan-reddy-భారతీయ జనతా పార్టీ బతిమలాడినా వైఎస్ ఆర్ కాంగ్రెస్ గత ఎన్నికలకు ముందు పొత్తుకు అంగీకరించలేదని తాజా మాజీ నెల్లూరు ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక విదానానికి కట్టుబడి బిజెపి వారు ఎంత అభ్యర్ధించినా అప్పట్లో పొత్తుకు వెళ్లలేదని చెప్పారు.

ADVERTISEMENT

[m9ad]

మీరు పొత్తుకు రాకపోతే, చంద్రబాబు సిద్దంగా ఉన్నారని చెప్పినా జగన్ అంగీకరించలేదని ఆయన అన్నారు. అయితే అదే జగన్ 2014 ఎన్నికల తరువాత స్వయంగా ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి సంధి కుదుర్చుకున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అయితే బీజేపీ వారు అడగకుండానే వెళ్ళి మద్దత్తు ఇస్తున్నామని ప్రకటించారు.

ఆ తరువాతి కాలంలో కూడా రెండు పార్టీలు ఒక తాటిపై నడుస్తునట్టుగానే కనిపించారు. చాలా మంది మేధావులు జగన్ ఉన్నాడనే ధైర్యం వల్లే చంద్రబాబుతో కమలనాధులు తెగతెంపులు చేసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పరిస్థితి బట్టి బీజేపీతో ఏ పార్టీ కూడా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు.

ADVERTISEMENT
Latest Stories