
నేటికీ సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు ‘యువగళం’ పేరుతో నారా లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తన యువగళం మధుర స్పృతులను సోషల్ మీడియా వేదికగా మరోమారు ప్రజలతో పంచుకున్నారు లోకేష్.
‘నియంతృత్వాన్ని, నిర్బంధాలను’ దాటుకుని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు దాదాపు 3132 కి.మీ పాటు సాగిన ఈ యువగళం పాదయాత్ర నేటికీ రెండేళ్లు పూర్తి చేసుకుంది.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
అయితే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న నేతను ఒక ప్రజా నాయకుడిగా మార్చిన చరిత్ర ఈ యువగళం సొంతం. పార్టీ కష్ట కాలంలో ఉంది, వ్యవస్థలు అప్పటి ప్రభుత్వ కబంద హస్తాలలో బందీగా నలిగిపోతున్నాయి, ఆంక్షలతో, అవరోధాలతో పాలకుల ఆటంకాలు వెన్నంటి నడిచాయి.
అయినా కూడా అదే పట్టుదల, అదే దీక్షతో కలిసి యువగళం పాదయాత్రను పూర్తి చేసారు నారా లోకేష్. అయితే ఈ పాదయాత్ర రాజకీయాలలో MBA వంటిదని, ఆ సమయంలో ప్రజలు తన పై చూపిన ప్రేమ తనను దృఢమైన రాజకీయ నాయకుడిగా మార్చిందంటూ లోకేష్ గత స్పృతులను నెమరేసుకున్నారు.
Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!
అయితే ఈ యువగళం పాదయాత్రతోనే లోకేష్ అటు ప్రజలకు దగ్గరయ్యారు, ఇటు పార్టీ క్యాడర్ కు సన్నిహితుడయ్యాడు. అలాగే టీడీపీ పార్టీ నాయకులకు ఆశ జ్యోతిగా నిలిచారు. ఆ పాదయాత్రలో లోకేష్ చూపిన చొరవ, తెగింపు పార్టీ క్యాడర్ కు బలాన్ని ఇచ్చింది, భవిష్యత్ మీద ఆశను కలిగించింది.
వైసీపీ హయాంలో చట్టం పరిధి దాటి అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరికి రెడ్ బుక్ ను పరిచయం చేస్తూ వైసీపీ నేతలకు భయాన్ని, సాధారణ ప్రజలకు, పార్టీ సిబ్బందికి భరోసాను కలిగించారు. పాదయాత్ర అంతే ముద్దులు పెట్టడం, నెత్తిన చేతులు పెట్టడం కాదు ప్రజలకు భవిష్యత్ మీద ఆశ చూపించడం అని రుజువు చేసారు.
Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?
అలాగే ప్రజలు తన నావద్దకు తీసుకొచ్చిన ప్రతి సమస్య మీద క్షుణ్ణమైన పరిశీల చేసి అందుకు తగ్గ పరిష్కార మార్గాలను అన్వేషించగలిగారు. ఆలాగే యువగళం పాదయాత్రలో తన ముందుకొచ్చిన అనేక అంషల మీద ప్రజలకు హామీలిచ్చారు. ఇప్పుడు ఆ హామీల అమలు దిశగా ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతున్నారు.