భారత్ ప్రధాని మోడీ అత్యంత ధైర్యశాలి.. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏ మాత్రం భయపడరు. ఓ సారి నిర్ణయం తీసుకున్నాక ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చినా ధైర్యంగా ముందుకే సాగుతారు తప్ప ఎట్టి పరిస్థితులలో వెనకడుగు వేయరని ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది.
భారత్ మహిళల నుదుట బొట్టు చెరిపేసిన ముష్కరుల భరతం పడతామని ప్రకటించి ‘ఆపరేషన్ సింధూర్’ ఆ పని మొదలుపెట్టారు. అందుకు యావత్ దేశ ప్రజలు, చివరికి పాకిస్థాన్ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా భారత్ ప్రధాని మోడీ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.
ఓ పక్క ప్రధాని మోడీ ఇంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తుంటే, పాక్ ప్రధాని ఓ పిరికిపంద అని, భారత్‌ని ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారని పాక్ పార్లమెంటులోనే ఓ ఎంపీ తీవ్రంగా విమర్శించారు.
మన ప్రధాని కనీసం భారత్ ప్రధాని మోడీ పేరు పలకడానికి కూడా భయపడుతున్నారని ఆ ఎంపీ విమర్శించారు. పాక్ ప్రధాని నిసహాయంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధ కలుగుతోందన్నారు. సరిహద్దులో దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న పాక్ సైనికులు తమ ప్రధాని తీరుని చూసి ఆత్మ స్థయిర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి చాతకాని, పిరికిపంద దేశానికి ప్రధానిగా ఉండటం చాలా బాధ కలిగిస్తోందంటూ ఆవేదనతో కన్నీళ్ళు పెట్టుకున్నారు.
యుద్ధ సమయంలో శతృదేశ పార్లమెంటులో మన ప్రధాని, ప్రభుత్వం, సైన్యం గురించి చెప్పుకొని, తమ చాతకానితనానికి వారు బాధపడుతుంటే మనకి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది?
కానీ పాక్ ప్రధాని కుర్చీలో ఎవరు కూర్చున్నా ఇంతకంటే ఏమీ చేయలేరనేది బహిరంగ రహస్యం. యుద్ధం జరుగుతుంటే దేశం వదిలి పారిపోకుండా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇంకా ఆ కుర్చీలో కూర్చుని ఉన్నారంటే చాలా ధైర్యవంతులుగానే పరిగణించాలి.
Pakistani PM Shahbaz Sharif is COWARD and afraid to take the name of Indian Prime Minister Modi- Our Force is being Lead by Jackal not Lion. Our forces are demotivated: Pak MP cries in Parliament amidst Indian retaliation pic.twitter.com/6IUBkP7akp
— Vikram Singh (@Bjp4vikramsingh) May 9, 2025




