తెలంగాణ మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత

Minister Jagadish Reddyallegations on BJP leader మంత్రి జగదీష్ రెడ్డి ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో రెక్కి జరిగిందని వచ్చిన వార్తలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే ఇప్పుడు ఆ విషయం మరో మలుపు తీసుకుంది. బీజేపీ నేత ,మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు కుమారుడు , మరికొందరు కలిసి డ్రోన్ కెమెరా తో ఆయన ఇంటిని ఫోటోలు తీశారట.

ADVERTISEMENT

[m9ad]

నాగారం గ్రామంలో మంత్రి నిబంధనలను ఉల్లంఘించి ఇల్లు కడుతున్నాడని, అక్కడ జరిపిన తవ్వకాలు, మట్టి పోత వంటి వాటి కారణంగా పక్కన ఉన్న ఎస్.సి కాలనీలో నీళ్లు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నారని సంకినేని చెప్పారు.మంత్రి అక్రమాలను బయటపెట్టడానికి తన కుమారుడు, మరికొందరు బిజెపి కార్యకర్తలు కలిసి వీడియో తేశారని ఆయన చెప్పారు

సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట నుండి బీజేపీ అభ్యర్థిగా మంత్రి జగదీష్ రెడ్డిపై పోటీ చెయ్యడం దాదాపుగా ఖరారైనట్టే. దీనితో ఒకరిపై ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగానే జగదీష్ రెడ్డి ని ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు సంకినేని.

ADVERTISEMENT
Latest Stories